‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’ టీజర్ వచ్చేసింది.. అనుష్క అందం.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ అదరహో!

- Advertisement -

‘భాగమతి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అనుష్క, మరియు ‘జాతి రత్నాలు’ వంటి హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి వెండితెర మీద కనిపించి చాలా సంవత్సరాలు అయిన సంగతి తెలిసిందే.వీళ్లిద్దరి అభిమానులు మళ్ళీ ఎప్పుడు వీళ్ళను వెండితెర మీద చూస్తామా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయం లో వీళ్లిద్దరు కలిసి ‘మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి’ అనే సినిమా చేస్తున్నామని అధికారికంగా ప్రకటించారు.

మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి
మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నేడు విడుదల చేసింది మూవీ టీం, ముందుగా సాయంత్రం ఆరు గంటలకు ఈ టీజర్ ని విడుదల చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసారు. కానీ చిన్న టెక్నికల్ లోపం వల్ల ఈ టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది.మరి ఈ టీజర్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఈ రివ్యూ లో చూడబోతున్నాము.

shetty mr polishetty

సినిమాలకు బాగా గ్యాప్ ఇచ్చింది కదా, అనుష్క బాగా లావెక్కిపోయింది,ఆమె అందం మొత్తం పోయింది అని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరిగేది అప్పట్లో.కానీ ఈ టీజర్ లో ఆమె బొద్దుగా, ఎంతో ముద్దుగా మునుపటి కంటే ఎంతో అందం గా కనిపించింది. ఈ చిత్రం లో ఆమె ఒక రెస్టారంట్ ని నడిపే యువతిగా కనిపించబోతుంది, అంతే కాదు సీనియర్ చెఫ్ గా వంట వండడం లో ఎంతో ప్రావీణ్యం కూడా ఉంది.

- Advertisement -
anushka shetty naveen

ఇక పనిపాట లేకుండా గాలి తిరుగుడు తిరుగుతున్న హీరో నవీన్ పోలిశెట్టి కి చదివిన చదువుకు తగ్గ ఉద్యొగం రాకపోవడం తో, చివరికి అనుష్క నడిపే రెస్టారంట్ లో చెఫ్ గా పనిచేయడానికి ఇంటర్వ్యూ కి వస్తాడు. నవీన్ పోలిశెట్టి మార్కు కామెడీ టైమింగ్ ని ఈ టీజర్ లో మనం చూడవచ్చు. కేవలం టీజర్ తోనే బ్లాక్ బస్టర్ కల ఉట్టిపడుతున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా అదే రేంజ్ అనిపించుకుంటుందో లేదో చూద్దాం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here