Mrunal Thakur : సీతారామం సినిమాతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూరు..సహజ నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించాడు.అంతే కాదు టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి.. హైదరాబాద్ లో ఇల్లు కూడా కొనేసిందట చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ ను బ్యాలెన్స్ చేస్తూ.. సినిమాలు చేస్తున్న ఈబ్యూటీ.. త్వరలో టాలీవుడ్ నుంచే పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేయాలని చూస్తోందట..ఇక సోషల్ మీడియా పాలోవర్స్ కూడా పెరిగిపోయారు. ఎప్పటికప్పుడు ఆమె ఇస్తున్న అప్ డేట్స్ చూస్తూ.. రకరకాల కామెంట్లు చేస్తుంటారు. ఈక్రమంలో మృణాల్ సడన్ గా ఆమె కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోని ఇన్ స్టా స్టోరీలో చూసి అభిమానులు కాస్త కంగారు పడ్డారు. అసలేమైంది? అంటూ ఆరాలు తీస్తున్నారు..
తాజాగా తన ఇన్ స్టా వేదికగా కంటతడి పెట్టుకుంది. నిన్న చాలా కష్టంగా ఉంది.. కానీ ఇవాళ బలంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. “నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈరోజు నేను మరింత బలంగా.. తెలివిగా.. చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరి కథలలో ఇలాంటి పేజీలు ఉంటాయి. కానీ అందరూ బయటకు చెప్పారు. నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఎవరైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కో రోజు అమాయకంగా బలహీనంగా ఉండడం మంచిది.. అమాయకంగా ఉండటం తప్పేం కాదు అని హీరోయిన్ మృణాల్ తన స్టోరీకి క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం మృణాల్ ఫోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ గురించి చెబుతూ ఏడ్చేసింది.. ఒక్కసారిగా మృణాల్ చాలా ఎమోషనల్ అయ్యారు.
ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సెల్ఫీ చిత్రంలో నటించింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఇంత టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ మనసులో ఇంత బాధ కూడా ఉందా..? అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇక వరుస సినిమా ఆఫర్లు సాధిస్తున్న మృణాల్.. టాలీవుడ్ లోనానీ సరసన 30వ సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్ లో ఆమె హీరోయిన్ గా నటించిన హిందీ సినిమా గుమ్రా ఏప్రిల్ 7న రిలీజ్ కు రెడీ అవుతోంది.