Sara Alikhan : వైట్ డ్రెస్ లో సారా అలీఖాన్ మెస్మరైజింగ్ ఫొటోషూట్

- Advertisement -

Sara Alikhan : బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది సారా అలీ ఖాన్. తొలి సినిమాతోనే హిట్ అందుకుని వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. మొదటి రెండు మూడు సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితమైనా.. ఆ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల అత్రంగీరే సినిమాలో తన టాలెంట్ ను బయటపెట్టింది.

Sara Ali Khan
Sara Ali Khan

నెపో కిడ్ గా బీ టౌన్ ఇండస్ట్రీకి పరిచయమైనా.. తన టాలెంట్ తో కెరీర్ లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది సారా. అందం, చలాకీతనం, అప్పుడప్పు కాస్త కవితలు రాస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటోంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఈ భామకు ఫాలోవర్లు కూడా ఎక్కువే.

Actress Sara Ali Khan
Actress Sara Ali Khan

తాజాగా సారా అలీఖాన్ ఫొటోషూట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సారా వైట్ డ్రెస్సులో కనిపించింది. వైట్ డ్రెస్సులో సారా ఏంజిల్ లా కనిపిస్తోంది. సన్ లైటు వెలుగులో జిగేల్ జిగేల్ మనిపిస్తోంది. ప్రస్తుతం సారా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Sara Ali Khan Photos
Sara Ali Khan Photos

ఈ ఫొటోల్లో సారా చాలా అందంగా కనిపిస్తోంది. సారా ఫొటోలు చూసిన కుర్రాళ్లకు కునుకు లేకుండా పోయింది. సారా ఈజ్ సో క్యూట్ అంటూ కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. వైట్ డ్రెస్సులో సారా చాలా క్యూట్ గా కనిపిస్తోందని తమ ప్రేమను కురిపిస్తున్నారు. కొత్త కొత్త ఔట్​ఫిట్లలో ఫొటోలు పోస్ట్​ చేస్తూ కుర్రకారును ఫిదా చేసింది.

Sara Ali Khan

ప్రస్తుతం సారా అలీ ఖాన్.. తన కొత్త సినిమా గ్యాస్‌లైట్ ప్రమోషన్‌లో బిజీగా ఉంది. తాజా ప్రమోషన్స్​లో ఆమె స్టైలిష్​ లుక్స్​లో దర్శనమిచ్చింది. వైట్​ డ్రెస్​లో అందాలు ఆరబోసింది. అయితే ఆమె డ్రెస్​కు ఫిదా అయ్యి.. ధర కోసం నెట్టింట వెతికిన అభిమానులు షాక్​ అయ్యారు. ఆ డ్రెస్​ అక్షరాల రూ.1.8 లక్షలు అని తెలిసి అవాక్కయ్యారు. ఖర్చు ఎక్కువైనా సరే సారా మాత్రం ఈ డ్రెస్సులో అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here