Ester Noronha : సినిమాలో ఛాన్స్ కోసం పడుకుంటే తప్పేంటి?.. ఎస్తేర్ హాట్ కామెంట్స్.!

- Advertisement -

Ester Noronha : ఇండస్ట్రీలో మీటూ ఉద్యమం పై పోరాడుతున్నారు.. మరికొంతమంది ఛాన్స్ రావాలంటే ఆ పని చేస్తే తప్పేంటి అంటున్నారు.. ఇందులో నోయల్ మాజీ భార్య ఎస్తర్ కూడా ఉన్నారు.. తాజాగా ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.. నటి ఎస్తేర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 1000 అబద్దాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత భీమవరం బుల్లోడు సినిమాతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకుంది. ఇక సినిమాలు చేస్తూనే ప్రముఖ సింగర్ నోయల్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే మొదట్లో బాగానే ఉన్నా వ్యక్తిగత కారణాలవల్ల వివాహం జరిగిన ఏడాదిలోపే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.. ఆ తర్వాత అమ్మడు బోల్డ్ సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపొయింది.. బోల్డ్ సినిమాలకు కేరాఫ్ గా మారింది..

Ester Noronha
Ester Noronha

ఇప్పుడు ఈ అమ్మడు చేసిన వ్యాఖ్యలు సంచలంగా మారాయి..ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై హాట్ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఎస్తేరు తెలుగులోనే కాదు కన్నడ , మలయాళం, మరాఠీ వంటి పలు భాషల్లో కూడా నటించింది. అలా అన్ని ఇండస్ట్రీలు చుట్టేస్తున్న ఈమె ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.. ఇప్పుడు అయితే విమెన్ ఎంపవర్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు.. కానీ ఇంకా ఆడవాళ్లకు ఏ ఇండస్ట్రీలోనైనా ఇబ్బందులు తప్పడం లేదు అంటూ తెలిపింది.. అది కామన్ అయిపోయిందని చెప్పింది..

ఇక్కడ అవకాశాల కోసం చెప్పింది చేసే వాళ్ళు ఉన్నారు.. అలా కాకుండా వద్దు అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు.. వాళ్ళలో నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను అవకాశాల కోసం మరీ అంత దిగజారలేను.. అందుకే ఒక సినిమా పోయినా పర్వాలేదు అనుకుంటాను అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. సినిమాల్లో ఎదగాలి అంటే పడుకోవాల్సిందే అన్నట్లుగా కొంతమంది మాట్లాడుతున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మన హద్దుల్లో మనం ఉంటే ఎవరు మనల్ని ఏమి చేయలేరు కదా అంటూ కూడా తెలిపింది.. ఒకరకంగా సినిమాలో ఛాన్స్ కోసం పడుకుంటే తప్పేంటి అని ఎస్తర్ కామెంట్స్ చేశారు.. ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here