Mrunal Thakur : ట్రెండీ లుక్ లో సీతారామం బ్యూటీ.. పరవశంలో తేలిపోతూ పోజులు

- Advertisement -

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్.. ఈ పేరు అంతగా టాలీవుడ్ ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ సీత, ప్రిన్సెస్ నూర్జహాన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సీత గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. అంతలా ఈ భామ సీతారామం సినిమాలోని తన పాత్రతో అలరించింది. ఇప్పటికీ.. ఎప్పటికీ తెలుగు ప్రేక్షకులకు సీత అనగానే గుర్తొచ్చేది మృణాలే.

సీతారామం సినిమాలో, ప్రమోషన్స్ లో చాలా సంప్రదాయంగా కనిపించింది మృణాల్. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన హవా చూపిస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో.. బోల్డ్ డ్రెస్సుల్లో ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తోంది ఈ భామ. ఈ బ్యూటీ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల మతిపోగొడుతోంది. అందాలు ప్రదర్శించడంలో తాను ఎవరికీ తీసిపోనంటూ పోటీపడి మరి గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.

Actress Mrunal thakur
Actress Mrunal thakur

తరచూ సోషల్ మీడియాలో తన ఫొటోలు పోస్టు చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. తాజాగా మృణాల్ పోస్టు చేసిన ఫొటోలు చూసి చాలా గ్యాప్ తర్వాత ఈ భామ ట్రెండీ ఔట్ ఫిట్ లో కనిపించిందని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. బ్లూ అండ్ బ్లాక్ సూట్ లో మృణాల్ ఠాకూర్ చాలా డ్యాషింగ్ గా కనిపిస్తోందని కుర్రాళ్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -
Mrunal Thakur Photos
Mrunal Thakur Photos

మృణాల్ ఠాకూర్ ఏ డ్రెస్సు వేసినా ముద్దుగానే ఉంటుందని కుర్రాళ్లు పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రకృతిలో ఈ భామ పరవశంతో దిగిన ఫొటోలు చూసి ఎంత అందంగా ఉందోనంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో సీతారామం సినిమాలోని ఇంతందం దారి మళ్లిందా.. నేలపైకి చేరిందా అంటూ పాటలు హమ్ చేస్తున్నారు. ప్రస్తుతం మృణాలో ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ బ్యూటీ సినిమాల సంగతికి వస్తే.. సీతారామం తర్వాత ఈ భామ తెలుగులో మరే సినిమా చేయలేదు. కాకపోతే నాని సినిమాలో నటిస్తున్నట్లు ఆ చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా పూజా కార్యక్రమాల్లోనూ ఈ భామ పాల్గొంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఆర్ సీ 15 సినిమా చేస్తున్న రామ్ చరణ్ దాని తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీలో హీరోయిన్ గా మృణాల్ ను ఎంపికే చేసినట్లు టాక్. ఇప్పటి వరకైతే దీని గురించి అధికారిక సమాచారం లేదు. ఈ బ్యూటీ తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here