తెలుగు వెండితెరకు పరిచయమైన మరో ఉత్తరాది సోయగం సయీ మంజ్రేకర్. నటుడు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె Saiee M Manjrekar . బ్యాక్‌గ్రౌండ్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఈ బ్యూటీకి అవకాశాలు తక్కువే. 2012లో కక్స్పర్ష్ అనే మరాఠీ మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీస్‌లో ఒకటై దబంగ్ సీక్వెల్లో నటించింది.
బాలీవుడ్ స్టార్ హీరోతో హిందీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేసినా ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ బావ ఆయుశ్ శర్మతో కలిసి మాంజా అనే వీడియో సాంగ్‌లో నటించింది. దీని తర్వాత సయీకి బాలీవుడ్లో అవకాశాలేం లేవు.
బాలీవుడ్ వద్దనుకున్న సయీని టాలీవుడ్ కాస్త అక్కున చేర్చకుంది. తెలుగులో వరణ్ తేజ్‌తో కలిసి గని మూవీ చేసింది. ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత అడవి శేశ్తో కలిసి మేజర్‌లో నటించింది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, ఇతర భాషల్లో బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. మూవీ హిట్ అయినా సయూకి ఆఫర్స్ మాత్రం రాలేదు.
సయూకి సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, ప్రియాంకా చోప్రా అంటే చాలా ఇష్టమట. ఈ బ్యూటీకి ట్రావెలింగ్ అంటే పిచ్చి. ఇంకా ఈ భామకు ముక్క లేనిదే ముద్ద దిగదట. నోరు కట్టేసుకోకుండా ఇష్టమైనవన్నీ తినేసి కాసేపు జిమ్‌లో వ్యాయామం చేస్తుందట.
బాలీవుడ్లో అవకాశాలేం రాకపోవడం వల్ల ప్రస్తుతం టాలీవుడ్లో సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందట ఈ బ్యూటీ. అందుకే తెలుగు భాషపై పట్టు సంపాదించే ప్రయత్నం చేస్తోందట. ఇక తెలుగు ఇండస్ట్రీలో రాణించాలంటే తన తండ్రి మహేశ్ మంజ్రేకర్ కొన్ని సూచలు చెప్పారట. డైలాగ్ ఏంటి? దాన్ని ఎలా.. ఏ ఎక్స్ప్రెషన్తో పలకాలి? ఇలా ప్రతిదానిపైనా జాగ్రత్తగా దృష్టి పెట్టమన్నారట. పదాల్ని ఈజీగా నేర్చుకోవడం, పలకడం ఎలాగో చిన్న చిన్న టిప్స్ కూడా ఇచ్చారట.
తెలుగు నేర్చుకోవడానికి ముందు ఓ సహాయకుడ్ని పెట్టుకుని సయీ.. డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేసేదట. ఆ తర్వాత నెమ్మదిగా సెట్లో ఉన్న వారితో మాట్లాడటం అలవాటు చేసుకుందని అంటోంది. తండ్రి స్టార్ యాక్టర్ అన్న ఒత్తిడి తనపై ఏం లేదని..అదొక బాధ్యతలా భావిస్తున్నానని చెబుతోంది ఈ ఉత్తరాది అమ్మడు. నటుడిగా తన తండ్రికి తెలుగులో మంచి పేరుందని.. తనలాగే సొంతంగా ప్రతిభతో నటిగా మంచి గుర్తింపు సాధించుకోవాలనుకుంటున్నానని చెబుతోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.