18 Pages Review : నిఖిల్-అనుపమ ప్రతి పేజీ ప్రేమతో నింపేశారుగా..

- Advertisement -

18 Pages Review : కార్తికేయ 2తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన నిఖిల్-అనుపమ మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ఇద్దరూ తమ సినిమా కెరీర్ లో రొటీన్ గా సాగిపోకుండా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఇద్దరు వర్సటైల్ యాక్టర్స్ కలిసి నటించిన మూవీయే  18 పేజెస్. లెక్కల మాస్టర్ సుకుమార్ రాసిన ఈ డిఫరెంట్ లవ్ స్టోరీ ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి నిఖిల్-అనుపమల బ్లాక్ బస్టర్ జర్నీ రిపీట్ అయ్యిందా.. ఈ ఇద్దరు కలిసి మరోసారి తెరపై మ్యాజిక్ చేశారా.. సుకుమార్ రైటింగ్స్ మళ్లీ సెన్సేషన్ క్రియేట్ చేసిందా తెలుసుకుందామా.. 18 Pages Review

18 pages Review
18 pages Review

రేటింగ్ : 3/5

స్టోరీ ఏంటంటే.. ఫోన్, సోషల్ మీడియా, ఇతర గ్యాడ్జెట్లు ఏం ఉపయోగించకుండా ప్రస్తుతమున్న ఉరుకుల పరుగులు ప్రపంచానికి పూర్తి దూరంగా జీవించే నందిని (అనుపమ పరమేశ్వరన్) అనే యువతి చుట్టూ కథ తిరుగుతుంది. మరోవైపు సిద్ధు(నిఖిల్) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ప్రీతి అనే అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. అలాంటి సమయంలో నందిని (అనుపమ) రాసిన డైరీ దొరుకుతుంది. ఆ డైరీలో నందిని రాసుకున్న వాటిని చదివి సిద్ధు ప్రేమలో పడతాడు. ఆమె లైఫ్ స్టైల్ నచ్చి అమెలాగే బతికేందుకు ప్రయతిస్తాడు. అయితే సనాతన ట్రస్ట్ కి చెందిన రంగనాథ్ అనే వ్యక్తిని కలిసి కవర్ ఇచ్చేందుకు నందిని హైదరాబాద్ వస్తుంది. ఆమె వెంట ఓ గ్యాంగ్ పడుతుంది.  నందిని చుట్టూ ఆ గ్యాంగ్ ఎందుకు తిరుగుతుంది? అసలు ఆ కవర్‌లో ఏముంది? నందిని డైరీలో ఉన్న విషయాలు ఏంటి?  సిద్దు, నందిని అసలు ఎలా కలుస్తారు? నందిని కోసం సిద్దు చేసిన పనులేంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

- Advertisement -
18 pages

మూవీ ఎలా ఉందంటే.. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయాలు.. వారి లైఫ్ స్టైల్స్ తో ఇంట్రెస్టింగా సాగిపోతుంది. ఇద్దరు విలక్షణమైన మనస్సులున్న వ్యక్తులు ఎలా కలుసుకుంటారు.. వారు కలుసుకోవడానికి కారణమయ్యే పరిస్థితులను చాలా నాటకీయంగా రాశారు. ఫస్ట్ హాఫ్ లో  ప్రేమ కథ, ఇంటర్వెల్ ట్విస్ట్‌లు క్లైమాక్స్ లో ఏం జరుగుతుందన్న ఆసక్తిని రేకెత్తిస్తాయి. సెకండ్ హాఫ్ అంతా నందిని కిడ్నాప్.. నందిని డైరీ సాయంతో సిద్ధు ఆమెను ఎలా కాపాడతాడనే దానిపై బేస్ చేసుకుని ఉంటుంది. క్లైమాక్స్ లో ట్విస్టులు ప్రతి మనసును కదిలిస్తాయి. 

యాక్టింగ్ ఎలా చేశారంటే.. నిఖిల్-అనుపమ మరోసారి తెరపై తమ మ్యాజిక్ క్రియేట్ చేశారు. కొన్ని సీన్లలో నిఖిల్ యాక్టింగ్ ఇరగదీశాడు. మరోవైపు అనుపమ ప్రతి యువకుడికి నచ్చుతుంది. ఆమె లైఫ్ స్టైల్ రియాలిటీకి కాస్త డిఫరెంట్ అనిపించినా.. అలా ఉంటే బాగుండేదన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ మూవీలో అనుపమ చాలా అందంగా కనిపించింది. ఆమె పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. మిగతా నటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. సాంకేతికంగా 18 పేజెస్ బాగుంది. గోపీసుంద‌ర్ పాటలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ క్లైమాక్స్ కు తగ్గట్టు బీజీఎం సరిపోలేదు. సుకుమార్ రైటింగ్స్ మళ్లీ మ్యాజిక్ చేసిందని చెప్పొచ్చు. డైరెక్టర్ పల్నాటి సూర్య ప్రతాప్ కథను ఆకర్షణీయంగా చెప్పడంలో పాక్షికంగా విజయం సాధించాడు.

సినిమా : 18 పేజెస్

దర్శకుడు : పల్నాటి సూర్య ప్రతాప్

నటీనటులు : నిఖిల్ సిద్ధార్థ & అనుపమ పరమేశ్వరన్

నిర్మాతలు : బన్నీ వాసు

సంగీతం : గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ : ఎ వసంత్న

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here