సుడిగాలి సుధీర్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలిస్తే షాక్ అవుతారు..

- Advertisement -

సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. మొదట మ్యాజిక్ షో చేస్తూ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా ఇండస్ట్రీకి వచ్చిన అతి కొద్దిరోజుల్లోనే స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. సినిమాల్లో కూడా వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై ప్రసారం అవుతున్న షోలలో కనిపిస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.. ఒక్కో షో కు సుధీర్ భారీ డిమాండ్ చేసేవారని టాక్.. ఇప్పుడు సినిమాలకు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్..

సుడిగాలి సుధీర్

సుధీర్ మొదట సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించేవాడు.. ఆ తర్వాత ఇటీవలే గాలోడు సినిమాతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు..మొదటి సినిమా యావరేజి గా ఆడింది, రెండవ సినిమా ఎప్పుడు వచ్చిందో, ఎప్పుడు వెళ్లిందో కూడా ఎవరికీ తెలియదు. కానీ మూడవ సినిమా ‘గాలోడు’ మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రాకపోయినప్పటికీ డివైడ్ టాక్ మీదనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిందంటే సుడిగాలి సుధీర్ రేంజ్ ఏంటో మీరే అర్థం చేసుకోండి..

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం సుధీర్ హీరో గా చేస్తున్న సినిమాలకు రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నాడని టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఇప్పుడు ఒక్కో సినిమాకి రెండు కోట్ల రూపాయలకు తక్కువ డిమాండ్ చెయ్యడం లేదట. ప్రస్తుతం ఆయన గోట్ అనే చిత్రం లో హీరో గా నటిస్తున్నాడు. తమిళం లో రీసెంట్ టైం లో సెన్సేషన్ గా మారిన యంగ్ హీరోయిన్ దివ్య భారతి ఇందులో సుధీర్ సరసన నటిస్తుంది.. అంటే ఇక సినిమా ఏమో కానీ వీరిద్దరినీ చూడటానికి అయిన జనాలు వస్తారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here