మళ్లీ వైరల్ అవుతున్న పవిత్రా నరేశ్.. ఈసారి పరీక్ష రాస్తూ దొరికిపోయారుగా

- Advertisement -

టాలీవుడ్​లో ప్రజెంట్ హాప్పెనింగ్ జోడీ అంటే పవిత్రా-నరేశ్​లదే. ఈ జోడీ చాలా రోజులుగా లైమ్​లైట్​లో ఉంటూ తెగ పాపులారిటీ కొట్టేశారు. ఇక వారి లవ్ స్టోరీపై ఏకంగా ఓ సినిమా కూడా తీసి ఆ పాపులారిటీని మరికాస్త పెంచుకున్నారు. ఎక్కడ చూసినా ఈ జంటే కనిపిస్తోంది. ఏ ఛానెల్ పెట్టినా వీళ్ల ఇంటర్వ్యూలే కనిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో పవిత్ర-నరేశ్​ల రచ్చ మామూలుగా లేదు. వీళ్ల రిలేషన్​షిప్​పై ట్రోలింగ్ ఒక ఎత్తయితే.. ఈ సినిమా ప్రమోషన్స్​లో ఈ జంట ప్రవర్తించిన తీరు మరొక ఎత్తు. మళ్లీ పెళ్లి సినిమాతో ఈ జంట ఇటీవల బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది.

అయితే సినిమా ప్రమోషన్స్​.. సినిమా రిలీజ్ తర్వాత ఈ జంట ఇక కనిపించదని అందరూ అనుకున్నారు. కొన్నిరోజులుగా మీడియా కూడా పవిత్ర-నరేశ్​లను మిస్ అవుతోంది. ఇక సోషల్ మీడియా వారియర్స్​కు.. ట్రోలర్స్​కు ఈ జంట గురించి కొత్తగా ట్రై చేద్దామనుకుంటే మసాలా ఏం దొరకడం లేదు. ఈ క్రమంలోనే ఈ జంట మరోసారి లైమ్ లైట్​లోకి వచ్చింది. మేమున్నాం.. మేం విన్నాం అన్నట్లుగా మీడియా మనసు తెలుసుకున్నట్టుగా.. సడెన్​గా సర్​ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈసారి ఏ సినిమా ప్రమోషన్ కోసమో.. పబ్లిక్ స్టంట్ కోసమో కాదు. ఓ ఎగ్జామ్ సెంటర్ దగ్గర కంట పడింది ఈ జంట. అదేంటి అనుకుంటున్నారా..? నిజమేనండి బాబు. ఇంతకీ అసలు స్టోరీ ఏంటంటే..?

పవిత్రా లోకేశ్.. కర్ణాటకకు చెందిన వ్యక్తి అని తెలిసిన విషయమే. అయితే పవిత్ర తన మాతృభాషలో పీహెచ్​డీ చేయాలనుకుందట. అందుకోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తోందట కూడా. ఇందులో భాగంగానే ఇటీవల పీహెచ్​డీ పరీక్షలకు హాజరైంది. అయితే పవిత్ర ఎక్కడుంటే నరేశ్ కూడా అక్కడేగా మరి. తన ప్రేయసిని పరీక్ష రాయించేందుకు స్వయంగా నరేశ్ బళ్లారి వెళ్లాడు. అక్కడ తన ప్రేయసితో పీహెచ్​డీ పరీక్ష రాయించాడు. అలా కన్నడ మీడియా కంట పడింది ఈ జంట. పవిత్ర పరీక్ష రాసే అంతవరకు నరేశ్ తన ప్రేయసి కోసం బయటే ఎదురు చూశాడట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

ఇక సోషల్ మీడియా వారియర్లకు దొరికిందే సందు అన్నట్లు వాళ్లు.. కీ బోర్డులకు పని చెప్పడం మొదలు పెట్టారు. లేటు వయసులో ఘాటు ప్రేమే అనుకున్నాం.. చాలా కలలే ఉన్నాయి ఈ జంటకు అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరేమో మాతృభాషపై ప్రేమ ఉండటం అంటే కన్నతల్లిని ప్రేమించినట్టే.. హ్యాట్సాఫ్ పవిత్రా లోకేశ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరేమో.. నరేశ్ మాత్రం లేటు వయసులో కాలేజ్ లవ్​ను ఎంజాయ్ చేస్తున్నాడని అంటున్నారు. కాలేజ్ టైంలో అయినా తన లవర్ కోసం ఇలా వెయిట్ చేశాడో లేదో కానీ.. ఇప్పుడు మాత్రం పవిత్ర కోసం ఇలా వెయిట్ చేశాడని గుసగుసలాడుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here