మిల్క్ బ్యూటీ తమన్నా, బాలివుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో ఉన్నారన్న వార్తలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే..ఆ వార్తలకు ఆజ్యం పోస్తూ ఈ అమ్మడు కూడా అతడితో పార్టీలు, పబ్ లు తిరగడమే కాదు లిప్ లాక్ లు ఇస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ పోస్ట్ చేసింది.. దాంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి… ఇక సోషల్ మీడియాలో పదే పదే వీరిజంట గురించి రకరకాల వార్తలు పుట్టుకోస్తున్నాయి.. ఇకపోతే వీరిద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారని, త్వరలోనే పెళ్లి డేట్ ను అనౌన్స్ చేయనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది..

ఇది ఇలా ఉండగా.. వీరిద్దరి పెళ్లికి తమన్నా మదర్ ఒప్పుకున్నట్లే ఒప్పుకొని ఒక కండిషన్ అల్లుడుకు పెట్టిందని సమాచారం.. అదేంటంటే.. మేము ఎప్పుడూ మా అమ్మాయికి ఇష్టం లేని పని చెయ్యలేదు.. తన ఇష్టం మా ఇష్టం.. తనకు ఇష్టమైతే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.. నువ్వు మాకు ఓకే అంది.. అలాగే తమన్నా పైకి కనిపించేంత రఫ్ కాదు.. చిన్నప్పటి నుంచి చాలా సెన్స్టివ్.. తనను బాధ పెట్టకుండా చూసుకోవడం నీ బాధ్యత.. తమన్న ఏదైనా అనుకుందంటే చాలా మొండిది.. నువ్వు అలాగే ఉండాలి.. లేకుంటే తను ఏదైనా చేస్తుంది.. మా అమ్మాయికి ఇష్టం లేకుండా ఎ పని చెయ్యకు.. కొట్టినా కొడుతుంది..
అలాగే తనకు ఇష్టం లేకుంటే అస్సలు ముట్టుకోకు అని ఓపెన్ గా తమన్నా అమ్మగారు కండిషన్స్ పెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వినిపిస్తున్నాయి.. ఇలాంటి కండిషన్స్ కు ఏ మగాడైనా ఒప్పుకుంటాడా.. బాలివుడ్ లో గుసగుసలు గుప్పు మంటున్నాయి.. అదేదో సినిమాలో చెప్పినట్లు కొడితే కొట్టించుకోవాలి.. గిల్లితే గిల్లించుకోవాలి అంటే విజయ్ ఏం చిన్న పిల్లోడు కాదు.. ఒకటి మాత్రం క్లియర్ గా అర్థమైంది.. పెళ్లికి ముందే ఇలా చెప్తున్నారు.. ఇక చేసుకుంటే మాత్రం ఎఫ్ 2 సినిమాలో వెంకటేష్ పరిస్థితి అవ్వడం పక్కా అంటూ నెటిజన్లు ఓ రేంజులో కామెంట్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది.. మరి ఇందులో నిజమేంతుందో చూడాలి.. ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 లో కూడా బోల్డ్ గా నటిస్తున్నారు..