ఏంటి ఇదంతా నిజమా.. మంచు లక్ష్మీ తన భర్తకు దూరంగా ఉంటుందా?

- Advertisement -

మంచు ఫ్యామిలికి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉన్న సంగతి తెలిసిందే.. తన ముగ్గురు పిల్లలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు మోహన్ బాబు కానీ ఏ ఒక్కరు కూడా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు ను అందుకోలేదు.. కొన్ని సినిమాలు చేసిన కూడా అవి భారీ సక్సెస్ ను అందుకోలేదు.. ఇక మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది.. ఏవో కొన్ని సినిమాలు చేసింది.

కానీ నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న కూడా సినిమాలు అయితే ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు..అయితే వార్తల్లో మాత్రం ఏదొక ఇష్యూ తో నిలుస్తూ ఉంటుంది.. మంచు లక్ష్మి కేవలం సినిమాల్లోనే కాకుండా కొన్ని టాక్ షో లలో కూడా హోస్టుగా చేసింది. ఇకపోతే మంచు లక్ష్మి మాట్లాడే విధానంపై ఎన్ని ట్రోల్స్ వస్తాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆమె మాట్లాడే భాషతో నెటిజన్లు దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు..

మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ

ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ అమ్మడు తన కూతురుతో కలిసి ఒంటరిగా ఉందని తెలుస్తుంది.. భర్తతో గొడవలు రావడంతో దూరంగా ఉంటుందని సమాచారం.. వాస్తవానికి అతను బిజినెస్ చేస్తూ అమెరికాలో ఉంటున్నాడు.. మంచు వారమ్మాయి మాత్రం ఇక్కడే ఉంటుంది.. ఎటువంటి ముఖ్యమైన ఫంక్షన్ జరిగిన కూడా ఆమె ఒక్కటే వెళుతుంది.. దాంతో ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లుయింది.. ఇక తాజాగా ఈ విషయం పై మంచు లక్ష్మీ స్పందించింది..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చింది..

- Advertisement -

మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నా భర్తతో విడాకులు తీసుకున్నాను అనే వార్తలు నా దగ్గరికి కూడా వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు.. ఆయన ఇంజనీర్ అందుకే అక్కడ ఉన్నారు.. నాకు సినిమాల్లో చెయ్యడం ఇంట్రెస్ట్.. నా ఇష్టాన్ని ఎప్పుడు కాదనడు.. అందుకే దూరంగా ఉండాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది.. ఈ విషయం పై మంచు మోహనబాబు కూడా స్పందించినట్లు తెలుస్తుంది.. సమాజాన్ని గౌరవిస్తారు.. నా పిల్లలు తప్పు చెయ్యరు.. ముఖ్యంగా మా అమ్మాయి గురించి నాకు తెలుసు.. ఇలాంటి వార్తలు రాస్తే ఊరుకోను అని అన్నట్లు సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here