నిహారికను ముద్దు పెట్టుకోవాలని ఉంది.. వైవా హర్షకు ఇలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా?

- Advertisement -

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు సొంత ప్రోడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే..అందులో వెబ్ సిరీస్ లను చేస్తూ వస్తున్నారు.. తాజాగా సొంత ప్రొడక్షన్ లో వస్తున్న ‘డెడ్ పిక్సెల్‌’ గురించి అందరికి తెలుసు.. నిహారిక కొణిదెల, వైవా హర్ష , అక్షయ్, సాయి రోనక్‌, భావన ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సిరీస్ ప్రమోషన్లో యూనిట్ బిజీగా ఉన్నారు.. అయితే తాజాగా ప్రమోషన్లో భాగంగా ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.. ఈ సందర్బంగా వైవా హర్ష కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..

వైవా హర్ష
వైవా హర్ష

గత మూడేళ్లుగా నిహారిక జీవితంలో ఎన్నో మలుపులు తిరిగాయి.. పెళ్లి, పబ్ కేస్, విడాకుల రూమర్స్.. ఇలా ఒకదాని తరవాత ఒకటి వస్తూ సోషల్ మీడియాలో నిహారికను హాట్ టాపిక్ గా మార్చాయి. ఇక ఈ వివాదాలను పక్కన పెట్టి.. నిహారిక ప్రస్తుతం కెరీర్ మీదనే ఫోకస్ పెట్టింది.

ఈ నేపథ్యంలోనే డెడ్ పిక్సల్స్ రిలీజ్ దగ్గరపడుతుండడటం తో వరుస ప్రమోషన్స్ చేస్తూ సిరీస్ గురించి వ్యక్తిగత విషయాల గురించి చెప్పుకొస్తుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో నిహారిక.. తనపై వస్తున్న రూమర్స్ గురించి స్పందించింది. అలాంటి రూమర్స్ గురించి కానీ, రూమర్స్ ను స్ప్రెడ్ చేసే వారి గురించి కానీ ఆలోచించనని తేల్చి చెప్పింది..

- Advertisement -

ఇక వైవా హర్ష మాట్లాడుతూ..‘నిహారిక, అక్షయ్, రోనక్, భావన అందరూ చక్కగా నటించారు. మా డైరెక్టర్ ఉగాది పచ్చడి లాంటి వారు. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయ’ని అన్నారు. నిహారిక డెడికేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.. నిహారిక పై తనకున్న ఇష్టాన్ని బయట పెట్టాడు.. కొన్ని సందర్భాల్లో ఆమెను ముడ్డుపెట్టుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు.. అయితే నిహారిక కుక్కను కొట్టినట్లు కొడుతుందని నా కోరికను ఆపుకున్నాను అని అన్నాడు.. అందుకు సంబందించిన వీడియో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది… ఇక ఈ వెబ్ సిరీస్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here