రక్తం తో రాసిన కథలు..#NTR30 ఫస్ట్ లుక్ అదుర్స్!

- Advertisement -

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి ఒక కొత్త సినిమా ప్రారంభం అవ్వడానికి చాలా సమయమే పట్టింది.ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ గత చిత్రం ‘ఆచార్య’ పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో #NTR30 కథ వేరే లెవెల్ లో ఉండాలనే కసితో స్క్రిప్ట్ వర్క్ పై మరో సంవత్సరం రోజులు సమయం తీసుకొని రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించారు.

NTR30
NTR30

ఈ షూటింగ్ కి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి, అతి త్వరలోనే మూడవ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతుంది.మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు మే 20 వ తారీఖున అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా అభిమానులు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ కాసేపటి క్రితమే ఫస్ట్ లుక్ కి సంబంధించిన వివరాలను ఒక కాన్సెప్ట్ పోస్టర్ ద్వారా విడుదల చేసింది మూవీ టీం.

ఎన్టీఆర్
ఎన్టీఆర్

ఈ పోస్టర్ లో ‘ఈ సముద్రం అతను రక్తాలతో రాసిన కథలతో నిండిపోయింది’ అంటూ రక్తం తో తడిచిన కత్తులతో కాన్సెప్ట్ పోస్టర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం క్యాప్షన్ తోనే పిచ్చెక్కించారని, ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఈ ఫస్ట్ లుక్ ని మే 19 వ తేదీన సాయంత్రం విడుదల చెయ్యబోతున్నారు. ఈ ఫస్ట్ లుక్ తోనే ఫ్యాన్స్ కి పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని మరోసారి ఏలబోతున్నాము అనే సంకేతం ఎన్టీఆర్ ఇచ్చే విధంగా ఉంటుందట.చూడాలి మరి ఎన్టీఆర్ ఈ చిత్రం తో ఎలాంటి రికార్డ్స్ ని నెలకొల్పబోతున్నాడు అనేది.ఇక ఈ చిత్రానికి టైటిల్ ‘దేవర’ అని ఫిక్స్ చేసినట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here