Raja Saab : బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరో అయిపోయారు. ఆ తర్వాత తీసిన ప్రతీ సినిమా పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నాయి. సలార్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తి యాక్షన్ మోడ్ లోకి వెళ్లిపోయాడు. ఇక తాజాగా ప్రభాస్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎప్పటిలా యాక్షన్ మూడ్‌లో కాకుండా.. కాస్త డిఫరెంట్‌గా కామిక్ రోల్లో కనిపించబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందట.. ఇందులో ప్రభాస్ ఎప్పుడు కనిపించని విధంగా చాలా డిఫరెంట్ గా ఉంటాడట.

ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్గా రాబోతుందట. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది వేచి చూడాలి. ఈ సినిమా విషయంలో మారుతీ కానీ.. ప్రభాస్ కానీ.. చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ సక్సెస్ కొడితేనే మారుతికి మంచి గుర్తింపు వస్తుంది. లేకపోతే ఆయన కెరీర్ డేంజర్లో పడే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు గోపీచంద్ తో తెరకెక్కించిన మూవీ పక్కా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొదటి అల్లు అర్జున్‌తో చేయాలని దర్శకుడు మారుతి భావించాడట. వాళ్ల కాంబోలో అంతకుముందు ఒక సినిమా రావాల్సి ఉంది. కానీ అది ఏవో కారణాలతో ఆగిపోయింది. ఇక తర్వాత ఆ సినిమా చేయాలి అనుకున్నాడు. కానీ అప్పుడు కూడా అల్లు అర్జున్ దర్శకుడు కొరటాల శివతో సినిమా చేస్తానని కమిట్ అవ్వడంతో ఈ సినిమా చేయలేకపోయాడు. దీంతో ఈ కథ ప్రభాస్ దగ్గరకు వెళ్లింది. ఈ సినిమాతో మారుతి ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.