Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా లేదా అనే భయం అభిమానుల్లో ఉండేది. కానీ ప్రశాంత్ నీల్ అభిమానుల అంచనాలను మించి ఈ చిత్రాన్ని చేసాడు.
ఫలితంగా సెన్సేషనల్ ఓపెనింగ్ వచ్చింది. ముఖ్యంగా ఈ చిత్రం లోని యాక్షన్ సన్నివేశాలు ప్రభాస్ కెరీర్ లోనే ది బెస్ట్ అని అంటున్నారు ఫ్యాన్స్. రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టబోతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా స్టోరీ మొత్తం ‘ఖన్సార్’ అనే నగరం చుట్టూ తిరుగుతుంది. ఇది ట్రైలర్ లో కూడా మనకి చూపించారు. అత్యంత సుందరవంతమైన ఈ నగరం కోసం వివిధ తెగలకు సంబంధించిన వారు చేదక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.
అయితే ఈ ‘ఖన్సార్’ నగరం నిజంగా ఉందా, లేదా సినిమా కోసం ఫిక్షనల్ గా ఈ నగరాన్ని చూపించారా అనేది అభిమానుల్లో మనస్సులో ఏర్పడిన ప్రశ్న. సినిమా చూసి రాగానే చాలా మంది ఈ నగరం పేరుతో గూగుల్ లో సెర్చ్ చెయ్యడం ప్రారంభించారు. అలా వెతకగా ఆ నగరం నిజంగానే ఉందని తెలిసింది. సలార్ చిత్రం లో ‘ఖన్సార్’ నగరం పాకిస్తాన్ కి గుజరాత్ కి మధ్యలో ఉన్నట్టుగా చూపిస్తారు. కానీ ఇది నిజానికి ఇండియా లో అయితే లేదు.
ఇరాన్ దేశం లో ‘ఖన్సార్ కౌంటీ’ అనే నగరం ఉంది. ఇక్కడ దాదాపుగా 22 వేల పెర్షియన్ దేశానికీ చెందిన వాళ్ళు ఉన్నారు. సినిమాలో చూపించినట్టుగా ఇది అత్యంత సుందరవంతమైన నగరం ఏమి కాదు. కేవలం ఒక్క చిన్న గ్రామం లాంటిది అంతే. ఈ విషయం ప్రశాంత్ నీల్ కి తెలుసో లేదో తెలియదు కానీ, అతను మాత్రం ఈ నగరం ని ఫిక్షనల్ గా భావించే సినిమాలో నిర్మించాడు.