Salaar Movie : నైజాం లో ఆల్ టైం రికార్డు నెలకొల్పిన ‘సలార్’.. భారీ మార్జిన్ తో #RRR అవుట్!

- Advertisement -

Salaar Movie : ప్రభాస్ నటించిన ‘సలార్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం దీనికే జరిగింది. యాక్షన్ సన్నివేశాల్లో ప్రభాస్ కటౌట్ ని పర్ఫెక్ట్ గా వాడుకోవడం, సెకండ్ హాఫ్ లో డ్రామా అద్భుతంగా పండడం తో ఈ సినిమా కి అంత మంచి టాక్ వచ్చింది.

Salaar Movie
Salaar Movie

ఫ్లాప్ టాక్ సినిమాలతోనే రికార్డ్స్ బద్దలు కొట్టే ప్రభాస్ కి సూపర్ హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సలార్ విషయం అదే జరుగుతుంది. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం #RRR రికార్డుని అవలీలగా బ్రేక్ చేసింది అంటే అది సాధారణమైన విషయం కాదు. ఒకసారి ఆ ప్రాంతం లో ఎంత వసూళ్లు వచ్చాయో చూద్దాం.

Prabhas

హైదరాబాద్ లో ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మినహా ప్రతీ సెంటర్ లో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ మరియు దేవి థియేటర్స్ యాజమాన్యాలు కమిషన్ బేసిస్ మీద అగ్రిమెంట్ చేసుకోవాలి అనడం తో బయ్యర్స్ అందుకు ఒప్పుకోలేదు. ఆ రెండు థియేటర్స్ లేకపోయినా కూడా సలార్ చిత్రానికి 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

- Advertisement -
Salaar Movie Prabhas

ఇక కరీంనగర్ లో అయితే ఏకంగా 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి #RRR రికార్డు ని బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది. కేవలం బెన్ఫిట్ షోస్ నుండే 1 కోటి 50 లక్షల రూపాయిల గ్రాస్ ని రాబట్టి ఓవరాల్ మొదటి రోజు 24 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది అని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. #RRR చిత్రానికి 22 కోట్ల రూపాయిల షేర్ మాత్రమే వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి రాజమౌళి తో పెట్టిన రికార్డ్స్ ని ప్రభాస్ సోలో గా వచ్చి బద్దలు కొట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here