Which movie waltair veerayya and veera simha reddy got highest collections’ : వాల్తేరు వీరయ్య..’వీరసింహారెడ్డి’..కలెక్షన్స్..విన్నర్ ఎవరంటే?



Which movie waltair veerayya and veera simha reddy got highest collections’ : ఈ సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య,నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి, తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు మరియు స్టార్ హీరో నటించిన తెగింపు ఇంకా చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాలు హిట్ తో పనిలేకుండా కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి.అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. .

Which movie waltair veerayya and veera simha reddy got highest collections'
Which movie waltair veerayya and veera simha reddy got highest collections’

కేవలం ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి కలెక్షన్స్ పై పడింది.. అసలు ఎంత వసూల్ చేశాయి..వీటిలో కామన్ పాయింట్స్ ఏంటా అని సినీ ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు.. అటు వాల్తేరు వీరయ్య ఇటు వీరసింహారెడ్డి రెండు చిత్రాల్లోనూ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ రెండు చిత్రాలను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారే నిర్మించారు. ఒకే నిర్మాణ సంస్థలో ఒక్క రోజు తేడా తోభారీ హిట్లను తన ఖాతాలో వేసుకోవడం చిన్న విషయం కాదు..రెండు సినిమాలు కూడా స్టార్ హీరోల సినిమాలు కావడం విశేషం..ఇది ఆ నిర్మాణ సంస్థ చరిత్రలో అరుదైన ఘనత..మొత్తానికి ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ను కలెక్షన్స్ తో షేక్ చేస్తున్నాయి…ఇకపోతే..

Walthair Veeraya And Veerasimha Reddy
Walthair Veeraya And Veerasimha Reddy

వాల్తేరు వీరయ్య సినిమాకు బాబి దర్శకత్వం వహించగా.. వీరసింహారెడ్డి సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. అయితే ఇద్దరు డైరెక్టర్లు ఈ సినిమాల్లో నటించిన హీరోలకు వీరాభిమానులు కావడం కామన్ పాయింట్‌..తాజాగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నేడు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 104 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. సుమారు 60కోట్ల షేర్‌ని దక్కించుకుంది. అంతేకాదు ఓవర్సీస్‌లో అన్ని స్టేట్స్ లో కలిసి సుమారు పది కోట్లు వసూలు చేయడం విశేషం. ఆల్మోస్ట్ ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌కి చేరుకుందని తెలుస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే దాదాపు 60 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి..మొదట రిలీజ్‌ అయిన వీరసింహారెడ్డి కలెక్షన్లు డ్రాప్‌ అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత వాల్తేర్‌ వీరయ్య, వారసుడు చిత్రాలు రిలీజ్‌ కావడంతో అది థియేటర్ల పరంగా వీరసింహారెడ్డికి దెబ్బ పడింది. అతి హింసా దీనికి మైనస్‌గా మారింది. చిరంజీవి సినిమాలో వినోదం కలిసొచ్చింది. దీంతో బాక్సాఫీసు వద్ద డామినేషన్‌ కనిపిస్తుంది. వీరసింహారెడ్డి కంటే వాల్తేర్‌ వీరయ్యకి తక్కువ థియేటర్లే కేటాయించినా కలెక్షన్లు ఎక్కువ రావడం విశేషం..మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి..