RRR చిత్రం ఈరోజు ఇంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి,ఇప్పుడు మరికొద్ది గంటల్లోనే ఆస్కార్ అవార్డు ని కూడా అందుకోబోతుంది. ఇది కేవలం రాజమౌళి కృషి వల్ల వచ్చింది కాదు, మూవీ కి పని చేసిన ప్రతీ ఒక్కరి కృషి, పట్టుదల వల్లే సాధ్యపడింది. ముఖ్యంగా మూవీ లో నటించిన ప్రధాన తారాగణం ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పాటుగా హీరోయిన్స్ అయినా అలియా భట్ మరియు ఒలివా మోరిస్ కి కూడా క్రెడిట్ దక్కాల్సిందే.
కానీ కేవలం హీరోలు రాజమౌళి మరియు కీరవాణి మినహా మిగిలిన నటీనటులెవ్వరికీ రావాల్సిన క్రెడిట్ అయితే రావడం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించిన ‘ఒలివా మోరిస్’ ని చిత్రం విడుదల తర్వాత ఒక్కరు కూడా పట్టించుకోలేదు. రీసెంట్ గానే HCA అవార్డ్స్ లో #RRR చిత్రానికి స్పాట్ లైట్ అవార్డు వచ్చింది.
కేవలం ఒక వ్యక్తికీ మాత్రమే పరిమితం కాకుండా ఈ అవార్డు మూవీ టీం మొత్తానికి వచ్చింది. కానీ ‘ఒలివా మోరిస్’ సినిమాలో అంత కీలకమైన పాత్ర పోషించినప్పటికీ ఆమె పేరు మీద HCA స్పాట్ లైట్ అవార్డు ఇవ్వలేదు. దీనిని కనీసం నెటిజెన్స్ కూడా గుర్తించకపోవడం బాధాకరం. వాస్తవం చెప్పాలంటే ఈ సినిమా అలియా భట్ పాత్ర నిడివి కంటే ‘ఒలివా మోరిస్’ పాత్ర నిడివి ఎక్కువ. పేక్షకాదరణ కూడా ఆమె పాత్రకే ఎక్కువ లభించింది, అయినా కూడా ఆమెని ఎవ్వరూ గుర్తించకపోవడం శోచనీయం.
రేపు ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరగబోతుంది, జీవితం లో మరుపురాని క్షణాలు ఇవి, వీటిల్లో పాలుపంచుకునేందుకు మూవీ కి పని చేసిన ప్రతీ ఒక్కరు హాజరైతే బాగుంటుంది. కనీసం ఆస్కార్ అవార్డ్స్ కి అయినా ఒలివా మోరిస్ ని మూవీ తరుపున ఆహ్వానించి ఆమెకి తగిన గౌరవాన్ని RRR మూవీ టీం ఇస్తుందో లేదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.