RRR For Oscars : ఆస్కార్ అవార్డ్స్ ఈవెంట్ లో #RRR మూవీ సరికొత్త ప్రయోగం.. వర్కౌట్ అయితే ప్రభంజనమే!

- Advertisement -

RRR For Oscars : గత ఏడాది పాన్ ఇండియా రేంజ్ లో అన్నీ బాషలలో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ ని నమోదు చేసి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి సరికొత్త చరిత్ర సృష్టించిన #RRR చిత్రానికి ప్రస్తుతం అంతర్జాతీయ అవార్డ్స్ వరుసపెట్టి వస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకి ఈ చిత్రానికి పాన్ వరల్డ్ రేంజ్ లో రీచ్ రావడాన్ని చూసి కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాదు,ఇండియా లో ఉన్న ప్రతీ సినీ అభిమాని ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నారు.అంతే కాకుండా ఈ చిత్రానికి ఆస్కార్స్ లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరిలో ‘నాటు నాటు’ పాటకి నామినేషన్స్ లో చోటు దక్కింది. మరి ఆ పాట కి అవార్డు దక్కుతుందా లేదా అనేది మరో పది రోజుల్లో తెలియనుంది. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ ఫంక్షన్ లాస్ ఏంజిల్స్ లో 12 వ తారీఖున జరగబోతుంది.

RRR For Oscars
RRR For Oscars

ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు #RRR టీం ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఇది ఇలా ఉండగా #RRR మూవీ టీం ‘నాటు నాటు’ పాట కి లైవ్ పెర్ఫార్మన్స్ ఇవ్వబోతున్నట్టు సమాచారం. అంటే మ్యూజిక్ ప్లే చెయ్యడం దగ్గర నుండి డ్యాన్స్ వరకు అన్నీ లైవ్ గానే ఉండబోతుందట. దీనికి సంబంధించి ప్రత్యేకంగా వారం రోజుల పాటు రిహార్సల్స్ కూడా చేయబోతున్నారట. ఎన్టీఆర్ ఇంకా అమెరికా లోకి అడుగుపెట్టలేదు. ఆయన మార్చి 4 లేదా 5 వ తేదీలలో రాబోతున్నాడు.

Rajamouli At Oscars

ఆయన వచ్చిన తర్వాత ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఆద్వర్యం లో రిహార్సల్స్ జరగనుంది. ఇలా మొత్తం లైవ్ గా ఉండేలా సరికొత్త ప్రయోగం చేస్తున్న #RRR మూవీ టీం సక్సెస్ అయితే మాత్రం మరోసారి ప్రపంచం మొత్తం #RRR చిత్రం పేరు మారుమోగిపోతాది. అదే ఊపులో ఆస్కార్ అవార్డు కూడా వచ్చేస్తే హిస్టరీ లో మార్చి 12 వ తేదీని ఎవ్వరు మర్చిపోలేని విధంగా మారిపోతాది.ఆ అరుదైన దృశ్యం కోసం మరో పది రోజులు ఎదురు చూడాల్సిందే.

Rajamouli At Oscars Awards
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here