Bigg Boss 7 Telugu : ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనా..ఈసారి మాములు రేంజ్ లో ఉండదు!

- Advertisement -

Bigg Boss 7 Telugu : తెలుగు బుల్లితెర పై ఈమధ్య కాలం లో తిరుగులేని ఎంటర్టైన్మెంట్ ని పంచిన షోస్ లో ఒకటి బిగ్ బాస్. మన తెలుగు వారికి అసలు పరిచయమే లేని కాన్సెప్ట్ అయ్యినప్పటికీ మిగిలిన భాషల్లో కంటే కూడా చాలా తొందరగా అర్థం చేసుకొని, ఈ రియాలిటీ షో కి కనీవినీ ఎరుగని రేంజ్ రెస్పాన్స్ ని ఇచ్చారు. ప్రతీ ఏడాది స్టార్ మా సరికొత్త సీజన్ తో ప్రసారమయ్యే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పటి వరకు ఆరు సీజన్స్ ని పూర్తి చేసుకుంది.

Bigg Boss Telugu
Bigg Boss telugu

ఈ ఆరు సీజన్స్ లో 5 సీజన్స్ TRP రేటింగ్స్ విషయం లో సరికొత్త ప్రభంజనం సృష్టించాయి. కానీ ఆరవ సీజన్ మాత్రం అనుకున్న రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవ్వలేదు. కంటెస్టెంట్స్ పెద్దగా ముఖ్య పరిచయం లేని వాళ్ళు అవ్వడం తో పాటు, మొదట్లో టాస్కుల పరంగా బాగా వెనుకపడడం తో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి.

అలా ప్రారంభంలోనే రేటింగ్స్ పడిపోవడం తో షో మళ్ళీ తిరిగి కోలుకోలేదు. ఆడియన్స్ లో ఆసక్తి కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు కానీ వర్కౌట్ అవ్వలేదు. దాంతో షో డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇప్పుడు 7 వ సీజన్ పై మళ్ళీ ఆడియన్స్ లో ఆసక్తి కలగాలంటే మొత్తం కొత్తగా ఉండాలి. హోస్ట్ దగ్గర నుండి కంటెస్టెంట్స్ వరకు అందరూ అశేష ప్రేక్షాభిమానులను కలిగి ఉన్నవారినే ఈ సీజన్ కోసం సంప్రదిస్తున్నారట. హోస్ట్ గా ఈ సీజన్ నుండి నాగార్జున ఇక తప్పుకున్నట్టే.

- Advertisement -
Bigg Boss 6

ఆయన స్థానం లోకి నందమూరి బాలకృష్ణ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆహా మీడియా లో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో లో బాలయ్య బాబు అదరగొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ షో కంటెస్టెంట్స్ విషయానికి వస్తే గత సీజన్స్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కొంతమంది ఈ సీజన్ లో కూడా తళుక్కుమని మెరుస్తారట, వారిలో నవదీప్ ,కౌశల్ వంటి వారితో పాటు సీరియల్ నటులు అమరదీప్ వంటి వారు కూడా ఈ షో లో పాల్గొనబోతున్నారు. వీటితో పాటుగా ప్రముఖ యాంకర్ అనసూయ ని సంప్రదిస్తున్నారు. ఇలా ప్రతీ విషయాన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సీజన్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Bigg Boss 7
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here