RRR For Oscars : 1 కాదు.. 2 కాదు.. ఏకంగా 5.. HCA అవార్డ్స్ లో హాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్ చేసిన #RRR

- Advertisement -

RRR For Oscars : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎవ్వరి ఊహలకు అందని అద్భుతాలు సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతూనే ఉంది.ఇప్పటికే ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ ని సొంతం చేసుకొని, ఆస్కార్ అవార్డ్స్ లో నామినేషన్స్ సంపాదించుకున్న ఈ చిత్రం,లేటెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో కూడా తన సత్తా చాటుతుంది.ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో #RRR చిత్రం ఏకంగా హాలీవుడ్ సినిమాలను సైతం డామినేట్ చేసేసింది అనడం లో ఎలాంటి అతిశయం లేదు.

RRR For Oscars
RRR For Oscars

‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్’ , ‘బెస్ట్ యాక్షన్ ఫిల్మ్’, ‘బెస్ట్ సాంగ్ (నాటు నాటు) మరియు ‘బెస్ట్ స్తంట్స్’ అవార్డ్స్ ని సొంతం చేసుకుంది.ఇవి కాకుండా స్పాట్ లైట్ అవార్డు ని కూడా సొంతం చేసుకొని, ఏకంగా 5 అవార్డులను గెలుచుకుంది.ఇది మామూలు అఛీవ్మెంట్ కాదు.ఈ ఈవెంట్ కి రాజమౌళి తో పాటుగా , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కీరవాణి మరియు కార్తికేయ హాజరయ్యారు.

Ram charan RRR For Oscars

అంతే కాకుండా ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ని అవార్డు ప్రెజెంటర్ ని చెయ్యడం మరో అరుదైన గౌరవం గా చెప్పుకోవచ్చు.అవార్డు ప్రెజెంటర్ అంటే రామ్ చరణ్ చేతుల మీదుగా ఒక క్యాటగిరికి అవార్డు ని ఇవ్వడం అన్నమాట.అలా హాలీవుడ్ నటులకు రామ్ చరణ్ చేతుల మీదుగా అవార్డుని ఇచ్చే అరుదైన గౌరవం HCA కల్పించింది అంటే, ఆయన క్రేజ్ హాలీవుడ్ లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -
NTR RRR For Oscars

అంతే కాకుండా వచ్చే నెల లాస్ ఏంజిల్స్ లో జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ కి కూడా #RRR మూవీ టీం మొత్తం హాజరు కానుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీ లో ‘నాటు నాటు’ సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే.ఈ అవార్డుని #RRR టీం గెలుచుకోవాలని ఇండియా మొత్తం కోరుకుంటుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం మన టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మారుమోగిపోతాది.

RRR For Oscars
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here