Vaarasudu Review : సంక్రాంతి పందెంలో వారసుడు గెలిచాడా..?

- Advertisement -

టైటిల్: వారసుడు
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
నటీనటులు : విజయ్‌, రష్మిక, శరత్‌ కుమార్‌, ప్రభు, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, జయసుధ, ఖుష్బూ, యోగిబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ : కార్తిక్‌ పళని
ఎడిటర్‌ : ప్రవీణ్‌ కె.ఎల్‌
మ్యూజిక్‌ : తమన్‌
నిర్మాతలు : దిల్‌ రాజు
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్‌ సాల్మన్‌
రిలీజ్ డేట్ : 14-01-2023

Vaarasudu Review :తమిళ హీరో ఇళయదళపతి విజయ్ తెలుగు ప్రేక్షకులకు పరిచితుడే. తుపాకి, పోలీసుడు వంటి డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ కు దగ్గరయ్యాడు. ఈ హీరోకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ ఎప్పుడెప్పుడు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉండేవాళ్లు. ఎట్టకేలకు ఆ టైం వచ్చింది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో విజయ్ హీరోగా వారసుడు తెరకెక్కింది. రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంక్రాంతి పందెంలో వారసుడు ప్రేక్షకుల మదిని గెలిచాడా.. లేదా చూద్దామా..?

Vaarasudu Review
Vaarasudu Review

కథ

మైనింగ్‌ రంగంలో తిరుగులేని పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజేంద్ర (శరత్‌ కుమార్‌)కు ముగ్గురు కుమారులు. జై (శ్రీకాంత్‌), అజయ్‌ (శ్యామ్‌), విజయ్‌ (విజయ్‌). అట్టడుగు స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన రాజేంద్ర తన సంస్థకు వారసుడిని ప్రకటించాలనుకుంటాడు. అప్పుడే విదేశాల్లో చదువు ముగించుకుని వచ్చిన విజయ్‌ని ఓ ఫంక్షన్‌లో పరిచయం చేస్తాడు. అలాగే తగిన ప్రతిభను చాటుకున్న కుమారుడినే తన వ్యాపార వారసుడిగా ప్రకటిస్తానని చెబుతాడు. అయితే ఆ రేసు ఇష్టం లేని విజయ్‌.. తండ్రి మాటలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడు. తల్లి సుధ (జయసుధ) అడ్డుకున్నప్పటికీ, కుటుంబం నుంచి విడిపోయి, ఏడేళ్లపాటు ఒంటరిగా ఉంటూ, ఓ స్టార్టప్‌ కంపెనీని ఆరంభిస్తాడు. 

- Advertisement -

ఇంతలో రాజేంద్ర, అతని సామ్రాజ్యాన్ని మట్టికరిపించడానికి ప్రతినాయకుడు జయప్రకాశ్‌ (ప్రకాశ్‌రాజ్‌) కుతంత్రాలు పన్నుతాడు. కుటుంబమంతా ఏకం కావాలంటే ఇంట్లో షష్టిపూర్తి నిర్వహిస్తే బాగుంటుందని సుధ అనుకుంటుంది. ఈ క్రమంలో రాజేంద్రకు ఓ దారుణమైన విషయం తెలుస్తుంది. వెంటనే, షష్టిపూర్తి కార్యక్రమానికి అంగీకరిస్తాడు. ఏడేళ్ల తర్వాత విజయ్‌ మళ్లీ ఇంటికి తిరిగొస్తాడు. కోలాహలంగా షష్టిపూర్తి జరుగుతున్న తరుణంలో.. అనూహ్యమైన పరిణామాలు ఎదురై ఆ కార్యక్రమం ఆగిపోతుంది. ఇద్దరు పెద్ద కుమారుల బాగోతం బయటపడుతుంది. దీంతో మళ్లీ ఆ ఇంటిని విడిచి వెళ్లాలనుకున్న విజయ్‌కి డాక్టర్‌ ఆనంద్‌ (ప్రభు) ద్వారా అసలు విషయం తెలిసి, మళ్లీ ఇంటికొస్తాడు. ఇంతలో మూడు ముక్కలైన ఆ కుటుంబం మళ్లీ కలిసిందా? విజయ్‌ తిరిగి రావడానికి కారణమేంటి? రాజేంద్ర వ్యాపార సామ్రాజ్యం ఏమైంది? విజయ్‌ తీసుకున్న నిర్ణయాలేంటి అన్నదే మిగిలిన కథ. 

Vaarasudu
Vaarasudu

ఎలా ఉంది?

ఓ తండ్రి, ముగ్గురు కుమారులు, తండ్రి ఆశయాలకు అడ్డుపడే విలన్, ఆ తండ్రిని పట్టించుకోకుండా స్వార్థంతో వెళ్లిపోయే అన్నదమ్ములు, వారిని కలిపేందుకు.. విలన్‌ను మట్టికరిపించేందుకు కథానాయకుడు చేసే ప్రయత్నాలు.. ఇవన్నీ తెలుగు సినిమాకు కొత్తేమీ కావు. మూసధోరణిలోని ఈ కథనే వంశీ పైడిపల్లి ఎంచుకోవడం… దానికి విజయ్‌ అంగీకరించడం కాస్త వింతే. రొటీన్‌ విలనిజం, తర్వాతి సన్నివేశంలో కథానాయకుడు ఎలా పావులు కదుపుతాడో ఇట్టే చెప్పేయొచ్చు. ఫస్టాఫ్‌లో నాలుగు, సెకెండాఫ్‌లో మూడు.. హీరో ఎలివేషన్‌ సన్నివేశాలున్నాయి. అవి విజయ్‌ అభిమానులను తృప్తి పరుస్తాయి. పాటలు, విజయ్‌ డ్యాన్సులు.. బాగా వర్కవుట్‌ అయ్యాయి. యోగిబాబుతో కలిసి విజయ్‌ నవ్వులు పూయించే ప్రయత్నమూ చేశారు. సినిమా చూశాక ఒకట్రెండు పాత సినిమాలు గుర్తొచ్చే అవకాశాలున్నాయి.

ప్లస్ పాయింట్స్  విజయ్‌ నటన, స్టైల్,పాటలు, కామెడీ,జయసుధ నటన, తమన్‌ సంగీతం

బలహీనతలు:  పాత కథ, అతకని సెంటిమెంట్‌

రేటింగ్ : 1.5 / 5

కన్ క్లూజన్  : ఈ సంక్రాంతికి పాత ‘వారసుడు’ వచ్చాడు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here