Dasara Movie : సిల్క్ స్మిత పోస్టర్ కు ఉన్న సంబంధం ఏమిటి?

- Advertisement -

Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా దసరా..ఈ నెల 30వ తేదీన థియేటర్లకు రానుంది. ఐదు భాషల్లో ఈ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరందుకున్నాయి. బొగ్గు గనులను ఆధారంగా చేసుకుని బ్రతుకుతున్న ‘వీర్లపాలెం’ అనే గ్రామం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.. ఒక కొత్త జోనర్ లో ఈ సినిమాలో నాని చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అన్నీ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి..

dasara movie
dasara movie

ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని పక్కా మాస్ లుక్ తో కనిపించనున్నాడు. అదే గ్రామానికి చెందిన ‘వెన్నెల’ అనే పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ లో సిల్క్ స్మిత పోస్టర్ .. ఆ పోస్టర్ దగ్గరే ఉన్న అరుగుపై ‘పవ్వ’ సీసా పట్టుకుని కూర్చున్న నాని కనిపిస్తూ వస్తున్నాడు.. సినిమా విడుదల దగ్గర పడుతున్నా, సిల్క్ స్మిత పోస్టర్ నేపథ్యాన్ని మాత్రం దర్శకుడు వదిలిపెట్టలేదు. ఈ సినిమాకీ .. సిల్క్ స్మితకు ఉన్న సంబంధం ఏమిటనే ప్రశ్న నానీకి ఎదురవుతూనే వస్తోంది. ఆయన సస్పెన్స్ లో పెడుతున్నాడు. మా డైరెక్టర్ గారు సిల్క్ స్మితకు పెద్ద ఫ్యాన్ అంటూ దాటవేస్తూనే వచ్చాడు. అందరిలో మాత్రం అందుకు సంబంధించిన ప్రశ్న అలాగే ఉండిపోయింది. సినిమాలోనే ఈ సస్పెన్స్ ఏంటో చూడాలి..

dasara movie

ఇక ఈ సినిమాకు మంచి బిజినెస్ ను అందుకుంది.. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 13.70 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.90 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 2.35 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 2 కోట్లు, గుంటూరులో రూ. 3.00 కోట్లు, కృష్ణాలో రూ. 2.00 కోట్లు, నెల్లూరులో రూ. 1.20 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 34.65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది..’దసరా‘ మూవీని శ్రీరామనవమి కానుకగా మార్చి 30వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు, ఓవర్సీస్ సహా ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని ఏరియాల్లోనూ దీనికి అదిరిపోయే స్పందన వస్తోంది.. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here