మెగా ఫ్యాన్స్ ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది..మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’..కొద్ది నిమిషాల ముందు ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా కూడా కూడా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. సినిమా రిలీజ్ కి ముందే ఓవర్సీస్ సెన్సార్ బోర్డులో ఇండియన్ సినిమాలు చూస్తానని.. అక్కడి నుంచే రివ్యూలు ఇస్తుంటానని చెప్పే ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చాడు చిరంజీవికి ఇది బెస్ట్ కమ్‌బ్యాక్ అని కొనియాడాడు. రవితేజ, చిరంజీవి కాంబో అదిరిపోయిందని.. ఇద్దరూ కలిసి వెండితెరపై అద్భుతం చేశారని స్పష్టం చేశాడు. ఇదొక మసాలా పాప్‌కార్న్ మూవీ అని అని జనాలకు మసాలా ట్రీట్ అని ఆయన అన్నారు..
సినిమాకు మంచి కథ, సంగీతం కుదిరాయని అన్నాడు. అలాగే, ఈ సినిమాకు ఉమైర్ సంధు 3 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. అయితే ఉమైర్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పిన సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి.. చిరంజీవి – బాబీ కాంబినేషన్లో ‘వాల్తేరు వీరయ్య’ సినిమా రూపొందగా, మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకు, దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ విడుదల అయిన పాటలకు మంచి రెస్పాన్స్ రాగా, మొన్నీమద్య ‘నీకేమో అందమెక్కువ .. నాకేమో తొందరెక్కువ పాట కి కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.ఇదొక్కటే కాదు ప్రతిదీ బాగా ఆకట్టుకున్నాయి..
ఇలా సాంగ్స్ మాత్రమే కాదు ప్రతి సీన్ కూడా జనాల చేత విజిల్ వేయించుకుందని తెలిసిందే.. ఊరమాస్ లుక్ లో చిరు ప్రేక్షకులను అలరించారు..ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 40 నిమిషాలు ఉంది. మొత్తంగా ఈ సినిమా నిడివి ఎక్కువగానే ఉంది. ఈ సినిమాను బాబీ ఔట్ అండ్ ఔట్. ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..తెలంగాణ (నైజాం)లో .. రూ. 18 కోట్లు.. రాయలసీమ (సీడెడ్)లో.. రూ. 15 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 10.2 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 6.50 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 6.50 కోట్లు.. గుంటూరు.. రూ. 7.50 కోట్లు.. కృష్ణ.. రూ. 5.6 కోట్లు.. నెల్లూరు..రూ. 3.2 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 72 కోట్లు.. కర్ణాటక .. రూ. 5 కోట్లు.. రెస్టాఫ్ భారత్.. రూ. 2 కోట్లు.. ఓవర్సీస్‌లో రూ. 9 కోట్లు బిజినెస్ జరిగింది.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్లు.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ. 89 కోట్లు రాబట్టాల్సి ఉంది. అందుతున్న సమాచారం ప్రకారం వీర సింహారెడ్డి వసూళ్లను దాటేసేలా ఉంది..మొదటి షోకు పాజిటివ్ టాక్ ను అందుకుంది..కలెక్షన్లు ఎంత రాబడుతుందో చూడాలి..