Waltire veerayya review: మాస్ ఎంటర్‌టైనర్.. హిట్ పడినట్లేనా?

- Advertisement -

టైటిల్: వాల్తేరు వీరయ్య
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
నటీనటులు:చిరంజీవి,రవితేజ,కెథరిన్, శృతి హాసన్ తదితరులు..
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ.విల్సన్
ఎడిటర్‌: నిరంజన్
మ్యూజిక్‌: దేవిశ్రీ ప్రసాద్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాబీ,కొన వెంకట్
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
రిలీజ్ డేట్ : 13 జనవరి, 2022
రన్ టైం : 160నిమిషాలు
ప్రి రిలీజ్ బిజినెస్ ( వరల్డ్ వైడ్‌): 140 కోట్లు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సంక్రాంతికి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం భారీ క్రేజ్‌తో అభిమానుల్లో అంచనాలు పెంచింది. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను, ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాన్ని తెలుసుకొందాం పదండి..


కథ:
గతంలో వచ్చిన సినిమాలతో వచ్చిన కథతో పోలిస్తే ఈ సినిమాను బాబీ భిన్నంగా చూపించారు..ఇద్దరు స్టార్ హీరోల తో కథను చక్కగా చూపించారు..అంతర్జాతీయ మాఫియా డ్రగ్ లీడర్ సాల్మన్ సీజర్‌ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. డ్రగ్ కేసును పోలీసు అధికారి (రాజేంద్ర ప్రసాద్) దర్యాప్తు చేపడుతారు వాల్తేరులో వీరయ్య (చిరంజీవి) దర్యాప్తుకు సహకరించడానికి మలేషియా వెళ్తాడు. అక్కడ అతిథి (శృతిహాసన్) వీరయ్యతో పరిచయం ఏర్పడుతుంది. దాంతో వారి మధ్య లవ్ మొదలవుతుంది..

- Advertisement -

మలేషియాలో డ్రగ్స్ దందాకు వీరయ్యకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి. ఏసీపీ (రవితేజ)కి, వీరయ్యకు మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది. డ్రగ్స్ కేసు ఎలాంటి మలుపులకు దారి తీసింది అనే ప్రశ్నలకు సమాధానం వాల్తేరు వీరయ్య కథ.వాల్తేరు వీరయ్య సినిమా కథ మెగాస్టార్ చిరంజీవికి టైలర్ మేడ్ క్యారెక్టర్. ఫస్టాఫ్ కామెడీ, యాక్షన్ అంశాలతో ఎంటర్‌టైనింగ్ సాగుతుంది. రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు పవర్‌పుల్‌గా ఉన్నాయి. శృతిహాసన్ గ్లామర్ పరంగాను, పాటల్లో స్టెప్పులతో ఆలరించింది..ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ కూడా తమ మార్క్ ను చూపించారు..పోటీ పడి మరీ సినిమాలో నటించారు..డైరెక్టర్ ప్రతి క్యారెక్టర్ ను బాగా వాడారు..ఎలా చూపించాలి అనుకున్నారో అలానే చక్కగా చూపించారు..మెగా ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్ ను ఇచ్చారు..తన ఖాతాలో హిట్ ను వేసుకున్నాడు…

ఇక దేవి శ్రీ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు విడుదల అయిన పాటలు ప్రేక్షకులను బాగా అలరించాయి..బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ కూడా జనాలకు గూస్ బంబ్స్ తీసుకొచ్చింది..తన మార్క్ ను దేవి చూపించి సినిమాను వేరే లెవల్ కు తీసుకెళ్ళాడు.. సినిమాలో ప్రతి అంశం కూడా జనాలను అలరించింది…టెక్నికల్ టీమ్ బాగా కష్ట పడ్డారు.. సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది..ఎడిటింగ్ అయితే ఫీక్స్..ఎక్కడ తగ్గలేదు..

ప్లస్ పాయింట్స్ ( + ) :
– చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్‌
– ఫస్టాఫ్ .. యాక్షన్ ఎపిసోడ్స్‌
– డీఎస్పీ బీజీఎం
– మాస్ సాంగ్స్‌

మైనస్ పాయింట్స్ ( – ) :
– స్టోరి ల్యాగ్
– అనవసరపు సీన్లు..


ఫైనల్‌గా..
గాడ్ ఫాదర్ తర్వాత చిరంజీవి నుంచి వచ్చిన ఈ ‘వాల్తేరు వీరయ్య’.. కాస్త కొత్తగా ఉందని పబ్లిక్ అంటున్నారు.. అయితే చిరంజీవి డైలాగ్స్, రవి తేజ సీన్స్, యాక్షన్‌, డ్యాన్సులు.. సెకండాఫ్‌లో ఫైట్స్ సాంగ్స్, రొమాన్స్.ఇవన్నీ కూడా సినిమా బాక్సాఫీస్ బరిలో సంక్రాంతికి విన్ అయినట్టే.. అయితే బాక్సాఫీస్ దగ్గర వాల్తేరు వీరయ్య ఎలా రాబడుతాడో చూడాలి..అందుతున్న సమాచారం ప్రకారం..బాలయ్య సినిమాను క్రాస్ చేసినట్లు టాక్..చూడాలి ఎలా వుంటుందో..

రేటింగ్ : 3 / 5

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here