Walthair Veerayya : రికార్డు బ్రేక్ చేసిన ‘వాల్తేరు వీరయ్య ‘ ట్రైలర్..ఫ్యాన్స్ కు పండగే..

- Advertisement -

Walthair Veerayya : మెగాస్టార్ గాస్టార్‌ చిరంజీవి తాజాగా నటిస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’.దర్శకుడు బాబీ తెరకెక్కించిన ఈ సినిమా లో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో రవితేజ కీలక పాత్ర పోషించారు. విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్పందన లభించింది..ఇక ఈ సినిమా లో చిరంజీవి మాస్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు.. ఇటీవల విడుదల అయిన సాంగ్స్ జనాలను విపరీతంగా అలరించాయి. దీంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి..అన్నీ కార్యక్రమాలను పూర్తీ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది..

Walthair Veerayya
Walthair Veerayya

ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కాబొతుంది… చాలా రోజుల తర్వాత చిరంజీవి లుక్ లో పై మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 13న భారీ అంచనాలతో వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వరుస అప్డేట్ లతో ప్రేక్షకులలో మంచి హైప్ ని క్రియేట్ చేస్తోంది.తాజాగా వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్కే బీచ్ లో నిర్వహించరు.

Trailer
Trailer

ఈ కార్యక్రమానికి మెగా, మాస్ అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే చిరంజీవి డైలాగ్స్, రవితేజ ఎంట్రీ అదిరిపోయాయి. ఈ ట్రైలర్ అధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉంది..డైలాగులు ఫ్యాన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చేలా ఉన్నాయి. రవితేజ, చిరంజీవి కాంబినేషన్‌లో సీన్స్‌కు విజిల్‌ పడటం పక్కా అన్నట్టుగా ఉందని చెప్పడంలో సందేహం లేదు.. అయితే ఈ ట్రైలర్‌ విడుదల అయిన కొద్ది నిమిషాలకే మిలియన్ వ్యుస్ ను క్రాస్ చేసింది..ఇది మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని రెట్టింపు చెస్తుంది…మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుండో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here