waltair veerayya మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే..మొదటి రోజు ఈ సినిమాకి రేటింగ్స్ సాయిల్ మీడియా లో ఉన్న పాపులర్ సైట్స్ మొత్తం డిజాస్టర్ రేంజ్ లో ఇచ్చాయి.కానీ చిరంజీవి కి ఉన్న మాస్ క్రౌడ్ పుల్లింగ్ వల్ల ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుండి ఫుల్ రన్ వరకు రికార్డ్స్ మీద రికార్డ్స్ ని నెలకొల్పుతూ సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. waltair veerayya
ఒక మామూలు యావరేజి కమర్షియల్ సినిమాతో ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.అయితే ఈ సినిమా రన్ దాదాపుగా అన్ని ప్రాంతాలలో క్లోజ్ అయ్యినట్టే.ప్రాంతాల వారీగా క్లోసింగ్ లో ఈ చిత్రం ఇప్పటి వరకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాము.
నైజాం | 36.22 కోట్లు |
సీడెడ్ | 18.31 కోట్లు |
ఉత్తరాంధ్ర | 19.40 కోట్లు |
ఈస్ట్ | 13.50 కోట్లు |
వెస్ట్ | 7.50 కోట్లు |
గుంటూరు | 9.28 కోట్లు |
కృష్ణా | 8.00 కోట్లు |
నెల్లూరు | 4.70 కోట్లు |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 116.91 కోట్లు |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 8.40 కోట్లు |
ఓవర్సీస్ | 13.25 కోట్లు |
మిగిలిన భాషలు | 0.16 కోట్లు |
వరల్డ్ వైడ్ (టోటల్) | 140.16 కోట్లు (షేర్) |
వాల్తేరు వీరయ్య ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 250 కోట్ల రూపాయిల వరకు చేసిందని సమాచారం.కేవలం కలెక్షన్స్ పరంగా మాత్రమే కాదు, ఈ సినిమా 50 రోజుల సెంటర్స్ విషయం లో కూడా మరో రికార్డు ని నెలకొల్పబోతుంది.విడుదలైన అన్ని కేంద్రాలలో దాదాపుగా 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది ఈ సినిమా.ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సుమారుగా 200 కేంద్రాలలో ఈ చిత్రం అర్థశతదినోత్సవం జరుపుకోబోతుంది.ఓటీటీ రాజ్యం ఏలుతున్న ఈరోజుల్లో ఒక సినిమా ఇన్ని కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోవడం అంటే సాధారణమైన విషయం కాదు.కేవలం 50 రోజులు మాత్రమే కాదు, వంద రోజులు కూడా ఈ సినిమా అత్యధిక సెంటర్స్ లో జరుపుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.