Sreeja Konidela : ఇదేక్కడి విడ్డూరం రా బాబు .. శ్రీజ అతన్ని పెళ్లి చేసుకోబోతుందా?

- Advertisement -

Sreeja Konidela : మెగాస్టార్ కూతురుగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి అందరికి తెలుసు… ఈ అమ్మడు పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. శ్రీజ మొదట్లో పెద్దలను కాదని ప్రేమ పెళ్లి చేసుకొని ఒక బిడ్డ పుట్టాక అతనితో అభిప్రాయ బేధాలు రావడంతో అతనికి విడాకులు ఇచ్చేసి మళ్ళీ తండ్రి చెంత కే చేరింది. ఆ తర్వాత కూతురు ఒంటరిగా ఉండడం చూడలేని చిరంజీవి ఆమెకు తన బంధువుల్లోని కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని రెండో పెళ్లి చేశారు.

sreeja konidela
sreeja konidela

అతనితో పెళ్లయ్యాక నవిష్కా అనే పాప శ్రీజ కి పుట్టింది. వీళ్ళిద్దరూ చాలా రోజులు అన్యోన్యంగా ఉన్నాక గత ఏడాది అభిప్రాయ బేధాలు వచ్చి వీళ్ళిద్దరూ వేరువేరుగా ఉంటున్నారు. విడాకులు తీసుకుంటున్నట్టు ఇప్పటికీ అఫీషియల్ గా వార్త బయటికి రాకపోయినప్పటికీ వీళ్లిద్దరూ వేరు వేరుగానే ఒంటరిగానే ఉంటున్నారు.. ఇక వీళ్లు పెట్టే మెసేజ్ ల ద్వారా వీళ్ళిద్దరూ విడిపోయారని అర్థమవుతుంది. అయితే ఎప్పటినుండో శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. శ్రీజ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఆ వార్తలన్నీటికి ఆజ్యం పొసేలా పోస్ట్ చేస్తుంది.. తాజాగా శ్రీజ సోషల్ మీడియాలో టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక కార్యక్రమంలో పాల్గొంది. అదే విధంగా సోషల్ మీడియాలో తన అభిమానులతో కలిసి కాసేపు ముచ్చటించి తన స్నేహితులతో దిగిన కొన్ని ఫోటోలను తన అభిమానులతో పంచుకుంది.

Sreeja Konidela

శ్రీజ షేర్ చేసిన ఆ ఫోటోలో సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ కూడా ఉండడం ప్రస్తుతం ఇప్పుడు అందరికీ షాక్ కు గురిచేస్తుంది. ఇంతకుముందే ప్రీతమ్ శ్రీజా పెట్టిన ఓ ఫోటో కి ఐ లవ్ యు అని కామెంట్ పెట్టడం అందరిని ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ తాజాగా శ్రీజ పెట్టిన ఓ ఫోటోతో మరోసారి క్లారిటీ వచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసి చాలామంది శ్రీజ సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ ను శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుందా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ విషయం ఎక్కడ వరకు దారితీస్తుందో వేచి చూడాలి…. ఏది ఏమైనా శ్రీజ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here