మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘ Waltair Veerayya ‘ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే..రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి కి వరుసగా ‘ఆచార్య’ మరియు ‘గాడ్ ఫాదర్’ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్స్ గా నిలిచాయి..అభిమానులు బాగా నిరాశకి గురయ్యారు..చిరంజీవి నుండి ఇక రికార్డ్స్ తిరగరాసే సినిమాలను చూడలేమా అని బాధపడుతున్న సమయం లో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం విడుదలై ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అభిమానుల్లో మామూలు జోష్ నింపలేదు.
ఇప్పటికే ఈ చిత్రం 120 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది..పండుగ సెలవులు ముగిసినప్పటికీ కూడా కలెక్షన్స్ లో స్ట్రాంగ్ హోల్డ్ ని చూపిస్తూ ముందుకు దూసుకుపోయింది ఈ చిత్రం..12 రోజులపాటు ఏకధాటిగా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి నిన్న బ్రేక్ పడింది..కోటి రూపాయిలకంటే తక్కువ షేర్ అనగా 70 లక్షల రూపాయిలను మాత్రమే నిన్న ఈ సినిమా వసూలు చేసింది.
కానీ ఈరోజు రిపబ్లిక్ డే అవ్వడం తో మరోసారి హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మార్నింగ్ షోస్ నుండే కలకాలాడిపోతున్నాయి ‘వాల్తేరు వీరయ్య’ మూవీ థియేటర్స్.. కొత్త సినిమా ‘పఠాన్’ విడుదలైనప్పటికీ కూడా జనాలు మొదటి ఛాయస్ గా ‘వాల్తేరు వీరయ్య’ నే ఎంచుకుంటున్నారు..దీనిని బట్టీ ఫ్యామిలీ ఆడియన్స్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు..ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టి చూస్తుంటే ఈ సినిమాకి ఈరోజు మూడు కోట్ల రూపాయలకు పైగానే షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
ఈరోజుతో పాటుగా వీకెండ్ కూడా ఉండడం తో సోమవారం నాటికి ఈ చిత్రం 130 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంటుంది అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.. రాజమౌళి సినిమాలు కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ 3 చిత్రాలుగా ‘అలా వైకుంఠపురం లో’ , ‘సైరా నరసింహా రెడ్డి’ మరియు ‘సరిలేరు నీకెవ్వరూ’ సినిమాలు ఉన్నాయి..ఈ రికార్డ్స్ ని ‘వాల్తేరు వీరయ్య‘ బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి.