Sudheer : సుధీర్ సినిమా కోసం వస్తున్న ప్రభాస్..ఫ్యాన్స్ కి ఊహించని ట్విస్ట్!

- Advertisement -

టాలెంట్ మరియు హార్డ్ వర్క్ ఉన్నప్పటికీ సక్సెస్ కి ఆమడదూరం లో ఉన్న హీరోల లిస్ట్ తీస్తే అందులో మహేష్ బాబు బావ సుధీర్ బాబు ముందు వరుసలో ఉంటాడు. శివ మనసులో శృతి అనే చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచయమైనా సుధీర్ బాబు, ఆ తర్వాత ప్రేమ కథా చిత్రమ్ తప్ప కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా లేదు.

థియేటర్స్ లో ఈయన సినిమాలను ఎలాగో చూడడం లేదు, కనీసం ఓటీటీ లో కూడా ఆడియన్స్ చూడడం లేదంటే సుధీర్ బాబు ప్రస్తుత పరిస్థితి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గానే ఆయన చేసిన ‘మామ మస్చిందా’ చిత్రం కూడా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆయన ‘హరోం హర’ అనే చిత్రాన్ని చేసాడు. ఈ సినిమాని ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

జ్ఞాన సాగర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా కి సంబంధించిన టీజర్ ని రేపు మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాలకు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేత విడుదల చేయించబోతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వేదిక ని కూడా ఏర్పాటు చేశారట. టీజర్ ని లాంచ్ చేసి, ఆ సినిమా గురించి నాలుగు మాటలు కూడా మాట్లాడబోతున్నాడట ప్రభాస్.

- Advertisement -

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మళ్ళీ ప్రభాస్ ని ఏ ఈవెంట్ లో కూడా చూడలేదు అభిమానులు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆయన సుధీర్ బాబు కోసం కనిపించబోతున్నాడు. సలార్ ప్రొమోషన్స్ ప్రారంభం అయ్యే ముందే ప్రభాస్ ని చూసే అదృష్టం కలగడం తో అభిమానులు ఎంతో ఆనందిస్తున్నారు. సలార్ చిత్రం వచ్చే నెల 22 వ తారీఖున విడుదల కాబోతుంది. డిసెంబర్ 1 వ తేదీన ట్రైలర్ ని విడుదల చెయ్యబోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here