Virupaksha : స్టోరీ లీక్‌.. సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసేట్టు ఉన్నాడుగా!

- Advertisement -

Virupaksha : బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా ‘వీరూపాక్ష’.ఈ చిత్రాన్ని ఆయన తన కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్నాడు.పాన్ ఇండియన్ లెవెల్ లో తెలుగు , తమిళం, మలయాళం , హిందీ మరియు కన్నడ బాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా కి సంబంధించిన టీజర్ రేపు విడుదల కాబోతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని నిన్న విడుదల చేసాడు.

Virupaksha
Virupaksha

ఈ విషయాన్నీ సాయి ధరమ్ తేజ్ ఈరోజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు, పవన్ కళ్యాణ్ ఈ టీజర్ ని లాంచ్ చేస్తూ ఉన్న ఫోటోలను అప్లోడ్ చెయ్యగా, అవి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్ ని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు.ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

pawan
pawan kalyan

ఇది ఇలా ఉండగా ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ రేంజ్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లబోతుంది అని తెలుస్తుంది, ముఖ్యంగా స్టోరీ పాయింట్ ఇప్పటి వరకు మనం ఎన్నడూ చూడని విధంగా ఉండబోతుంది అట.మొన్న విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో లోనే ఈ సినిమా స్టోరీ ప్లాట్ ఏమిటో రెవీల్ చేసాడు డైరెక్టర్.అజ్ఞానం అనేది భయానికి మూలం,ఆ అజ్ఞానం మూఢనమ్మకాలకు దారి తీస్తుంది.ఒక పల్లెటూరు లో ఇలా అజ్ఞానం తో ఉన్న ప్రజలను , కొంతమంది మూఢనమ్మకాలతో భయపెట్టి, వాళ్ళని ఏమార్చి ఊరి నుండి గెంటేయాలని చూస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళను కాపాడేందుకు హీరో ఎలాంటి సాహసాలు చేసాడు అనేదే స్టోరీ.

- Advertisement -

మూవీ మొత్తం హారర్ జానర్ లో ప్రేక్షకులను కళ్ళు పక్కకి తిప్పుకోలేనంత అద్భుతమైన స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాని తీస్తున్నాడట.కచ్చితంగా థియేటర్స్ లోనే చూడాలి అనిపించే సినిమా ఇది , సుకుమార్ రైటింగ్స్ ద్వారా తెరకెక్కబోతున్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నట్టు సమాచారం.ఈ చిత్రం తో సాయి ధరమ్ తేజ్ స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవుతాడని బలంగా నమ్ముతున్నారు అభిమానులు.మరి వాళ్ళ నమ్మకాన్ని ఈ సినిమా నిలబెడుతుందో లేదో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here