యూట్యూబ్​లో విజయ్ ధమాకా.. ట్రెండింగ్​లో ‘రంజితమే’ సాంగ్కోలీవుడ్‌ స్టార్‌, ఇళయదళపతి విజయ్‌ ఏం చేసినా ట్రెండ్​ అవుతుంది. ఇక విజయ్ సినిమాల గురించి అప్​డేట్స్ వచ్చాయంటే ఫ్యాన్స్ ఆనందం మామూలుగా ఉండదు. ఎప్పుడెప్పుడు అప్​డేట్స్ వస్తాయా అని కాచుకు కూర్చుంటారు ఫ్యాన్స్. ఇక అప్​డేట్ వచ్చాక వాటి రికార్డ్లు సెన్సేషన్ క్రియేట్ చేస్తారు. అలా ప్రస్తుతం క్రియేట్ అయిన సెన్సేషన్​ ఏంటో తెలుసా..?

 

కోలీవుడ్ ఇళయదళపతి విజయ్ మేనియా ఇప్పుడు యూట్యూబ్‌ని షేక్‌ చేస్తోంది. ఆయన హీరోగా నటించిన ‘వారిసు’లోని ఫస్ట్‌ సింగిల్‌ యూట్యూబ్​లో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ‘రంజితమే’ అంటూ సాగే ఈ మాస్‌ సాంగ్‌ను విడుదల చేసి పది రోజులవుతోన్నా క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు సరికదా.. మరింత పెరుగుతోంది. ఈ విషయాన్నే తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ ఓ సరికొత్త పోస్టర్‌ షేర్‌ చేసింది. ఇప్పటివరకూ ఈ పాట 5 కోట్ల వ్యూస్‌, 18 లక్షల లైక్స్‌ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఫ్యామిలీ, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘వారిసు’. వంశీ పైడిపల్లి దర్శకుడు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ పేరిట విడుదల చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో విజయ్‌ ఏకకాలంలో నటిస్తున్న చిత్రం వారిసు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, ప్రభు, ప్రకాష్‌రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటివరకు డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విజయ్ ఈ మూవీతో నేరుగా పలకరించబోతున్నారు.