రెజీనా కసాండ్రా.. ఈ తమిళ భామ 16 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతకంటే ముందు టెలివిజన్‌పై సందడి చేసింది Regina Cassandra. చిన్న వయసులోనే యాంకర్‌గా మారిన రెజీనా ఓ టీవీ ఛానల్ క్విజ్ ప్రోగ్రామ్‌కు యాంగరింగ్ చేసింది. ఆ తర్వాత 2005లో కాదల్ నాల్ ముధల్ అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
2012లో ఎస్ఎంఎస్ అనే మూవీతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది రెజీనా. ఆ తర్వాత రొమాంటిక్ లవ్‌స్టోరీ, పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, పవర్, రారా కృష్ణయ్య, నక్షత్రం, అ!, ఎవరు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమాల తర్వాత అడపాదడపా కొన్ని సినిమాలు చేసినా అవి అంత గుర్తింపు తీసుకురాలేకపోయాయి. ఇటీవల మరో హీరోయిన్ నివేధా థామస్‌తో కలిసి శాకిని ఢాకిని అనే చిత్రంలో నటించింది. ఈ మూవీలో రెజీనా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
కేవలం హీరోయిన్గా కాకుండా తన పాత్రకు బలముంటే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు రెజీనా ఓకే చెప్పేస్తుంది. అలాంటి పాత్రే విశాల్ హీరోగా తెరకెక్కిన చక్ర సినిమాలో చేసింది. ఆ మూవీలో ప్రతినాయిక లక్షణాలున్న పాత్రలో కనిపించి తనలోని వర్సటాలిటీని బయటపెట్టింది.
ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్. తనచూ కొత్తకొత్త ఫొటోషూట్లు చేస్తూ బిజీగా ఉంటుంది. వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన రెడ్ డ్రెస్‌లోని పిక్స్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫొటోల్లో రెజీనా రెడ్ కలర్ సూట్ ధరించింది. ఈ సూట్లో రెజీనా సూపర్ హాట్‌గా కనిపిస్తోంది. రెడ్ సూట్లో రెజీనా పోజులు చూసిన కుర్రకారు మనసు పారేసుకుంటున్నారు. ఆమె అందాలకు ఫిదా అవుతున్నారు.