Vijay Kanth : ఆ స్టార్ హీరో దుస్థితిని చూసి కన్నీరుమున్నీరవుతున్న అభిమానులు

- Advertisement -


Vijay Kanth : కోలీవుడ్ స్టార్ హీరో, డీఎండీకే అధినేత విజయ్ కాంత్‌ అనారోగ్య సమస్యలతో గత కొన్నిరోజులుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తీసుకున్నారు. ఇటీవలే ఆయన తిరిగి కోలుకొని ఇంటివచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతుంటారు. ఇటీవల డీఎండీకే పార్టీ ఆఫీసులో జరిగిన జన్మదిన వేడుకకు విజయకాంత్‌ హాజరయ్యారు. ఆ సమయంలో ఆయన పరిస్థితిని చూసిన కేడర్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన ఇంటికే పరిమితమయ్యారు. డీఎండీకే పార్టీ బాధ్యతలు ఆయన భార్య చూసుకుంటున్నారు.. తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి విజయ్ కాంత్ హాజరయ్యారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Vijay Kanth
Vijay Kanth

ఇక మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో డీఎండీకె వర్కింగ్ కమిటీ, జనరల్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ పాల్గొన్నారు. డీఎండీకె జనరల్ సెక్రటరీగా ప్రేమలత విజయకాంత్ నియమితులయ్యారు. ఈ సమావేశంలో పార్టీ అభివృద్ధికి సంబంధించిన విషయాలను చర్చించారు . ఈ సమావేశంలో ప్రధానంగా 15 తీర్మానాలను ఆమోదించారు. వాటిలో విజయకాంత్ ఆరోగ్యంపై వదంతులు ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. పార్లమెంటరీ ఎన్నికల్లో పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశానికి హాజరైన విజయ్ కాంత్ ను చూసి అక్కడకు వచ్చిన కార్యకర్తలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here