Guess The Actress : ఈ ఫోటోలో ఉన్న బూరె బుగ్గల చిన్నదాన్ని గుర్తుపట్టారా.. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్

- Advertisement -


Guess The Actress : పై ఫోటోలో బూరె బుగ్గలతో ముద్దుగా కనిపిస్తున్న ఈ చిన్నారి గుర్తుపట్టారా? అతి తక్కువ సమయంలోనే సౌత్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఎంతో మంది హీరోలకు అదృష్ట దేవతగా మారిన ఈ బ్యూటీ తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. 2007లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ అదే క్రేజ్‌తో సక్సెస్‌ఫుల్‌గా తన కెరీర్ కొనసాగిస్తోంది.

Guess The Actress
Guess The Actress

కరోనా టైంలో పెళ్లి చేసుకుని కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది ఈ క్యూటీ. టాలీవుడ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఎవరో మీకు ఇప్పటికైనా గుర్తుకు వచ్చిందా ? తనే టాలీవుడ్ చందమామ.. కాజల్ అగర్వాల్. లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత 2009లో రామ్ చరణ్ సరసన మగధీరలో నటించి భారీ బ్లాక్ బస్టర్ ను అందుకుంది. కాజల్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ టాప్ హీరోలందరి సరసన నటించింది.

Kajal aggarwal

2020లో తన సన్నిహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడి 2022లో నీల్ కిచ్లుకు జన్మనిచ్చింది. పెళ్లి తర్వాత కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్న ఈ క్యూటీ రీసెంట్‌గా బాలయ్య సరసన భగవంత్ కేసరితో రీఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2లో నటిస్తుంది. దాంతో పాటు సత్య భామ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. క్షణం తీరిక లేకుండా బిజీగా గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫోటోలతో ప్రేక్షకులను ట్రీట్ ఇస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here