Sathya Sri : ‘నా పెట్టే తాళం..’ లాంటి డబుల్ మీనింగ్ పాటలంటే నాకు చాలా ఇష్టం. సత్యశ్రీది ఇంత గలీజ్ టేస్టా

- Advertisement -

Sathya Sri : వక్కంతం వంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఈ మూవీలోని ఓ పాట తీవ్ర చర్చకు కారణం అయ్యింది. ఓ బూతు పాటను సినిమాలో పెట్టడం ఏంటనే విమర్శలు వచ్చాయి. అదీ అమ్మాయిలతో ఆ పాటకు స్టెప్పులు వేయించడం ఏంటని పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ పాట వివాదం గురించి నటి సత్యశ్రీ కీలక విషయాలు వెల్లడించింది. ఈ పాటలో ఎందుకు నటించాల్సి వచ్చిందో వివరించింది.

Sathya Sri
Sathya Sri

“ఈ పాట మూడు రోజుల్లో షూట్ చేస్తారనగా నాకు సినిమా యూనిట్ నుంచి కాల్ వచ్చింది. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ కు మీరు సూట్ అవుతారని అనుకున్నాం. ఈ క్యారెక్టర్ కు డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. స్విచ్చువేషన్ కు తగినట్లుగా ఈ పాట వస్తుంది అని చెప్పారు. నేను కూడా సరే అన్నాను. రేపు షూట్ అనగా, ఈ రోజు సాంగ్ ఏంటండీ అని అడిగాను. వాళ్లు ఇదీ సాంగ్ అని చెప్పారు. నా ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. రేపు పాట షూట్. చేస్తానని ఒప్పుకున్న. కాస్ట్యూమ్స్ కూడా వచ్చాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా, షూట్ కి వెళ్లాను. మొదట్లో నితిన్ తో ఓ సీన్ లో నటించాను. ఆ తర్వాత శేఖర్ మాస్టర్ వచ్చారు. మంచి క్యారెక్టర్ వచ్చింది చెయ్ అన్నారు.

Sathya Sri Photos

పాట ప్లే చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది. నాకు ఎక్స్ ప్రెషన్స్ రావట్లేదు. శేఖర్ మాస్టర్ వచ్చి మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దని చెప్పారు. అయినా, నేను చేయలేకపోతున్నాను. 15 టేకులు తీసుకున్నాను. ఎక్స్ ప్రెషన్స్ రావట్లేదు. అప్పుడు దర్శకుడు వంశీ వచ్చి, సత్య నిన్ను ఎక్స్ పోజింగ్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ సెక్సీ లుక్స్ ఇవ్వు చాలు అన్నారు. నన్ను నమ్ము, వల్గారిటీ ఉండదు అని చెప్పారు. ఆయన చెప్పినట్లే చేశాను. మూడు రోజులు షూట్ చేశాం. నేను భయపడినంతగా ఏమీ లేదు. చాలాసార్లు దర్శకుడిని అడిగాను, ఈ పాట వేరేలా జనల్లోకి వెళ్లదు కదా అని. ఆయన లేదని చెప్పారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. హీరో నితిన్ కూడా చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నారు” అని చెప్పుకొచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here