Vijay Varma : కరీనాతో అలాంటి సీన్లు చేయాలంటే భయపడ్డాడుట.. తమన్నా బాయ్ ఫ్రెండ్ ఆ విషయంలో వీక్ అనుకుంటా..

kareena kapoor vijay varma


Vijay Varma : రోజు రోజుకు ఓటీటీల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో కరీనా కపూర్ కూడా వెబ్ సిరీస్‌లు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది. అందులో భాగంగానే తొలి సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘జానే జాన్’ పేరుతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ త్వరలో స్ట్రీమింగ్ కు రానుంది.

Vijay Varma :
Vijay Varma :

క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందుతున్న ఈ సిరీస్ కు సుజయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. కరీనా కపూర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ లో, విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ కీలక పాత్రలను పోషించారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చిత్రబృందం ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా నటుడు విజయ్ వర్మ కరీనా కపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఓ అద్భుత నటిగా అభివర్ణించారు. ఆమె మంచి మనసు కలిగిన వ్యక్తి అన్నారు. ఈ సందర్భంగా ఒకప్పుడు తాము కరీనా సినిమాలు చూసి ఎలా ఎంజాయ్ చేసేదో చెప్పుకొచ్చారు.

Vijay Varma tamanna

“మేము ఆమె సినిమాలు చూస్తూ విజిల్స్ కొట్టే వాళ్లం. ఆమెను అభిమాన హీరోయిన్ గా భావించేవాళ్లం. ఇప్పుడు ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది” అన్నారు. ఇక రొమాంటిక్ సన్నివేశాల్లో తనతో కలిసి నటించడం చాలా భయం కలిగించిందన్నారు. ఆమెతో కలిసి శృంగార సన్నివేశాలు చేసే సమయంలో తన శరీరంలో వణుకు పుట్టేదన్నారు. “ఆమె అద్భుతంగా నటించగలదు. ఆమె ఎంత అందంగా ఉంటుందో, అంతకు మించి ప్రశాంతంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.