Samantha కి మయోసిటిస్ వచ్చినప్పుడు రామ్ చరణ్ ఇంత సహాయం చేశాడా..! ఆయన వల్లే కోలుకుందా?

- Advertisement -

సౌత్ ఇండియా లో Samantha కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, అనతి కాలం లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.

Samantha
Samantha

అంతే కాదు నేటి తరం లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ మరియు ఓవర్సీస్ రికార్డ్స్ ఉన్న హీరోయిన్ కూడా సమంత మాత్రమే. అయితే ఈమె కెరీర్ పరంగా ఎంత మంచి సక్సెస్ ని అందుకున్నా, వ్యక్తిగత జీవితం లో మాత్రం ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకి ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధి సోకింది.

samantha ruth prabhu

ఈ వ్యాధికి గత కొంత కాలం నుండి సమంత చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చివరి దశ ట్రీట్మెంట్ కోసం అమెరికా కి వెళ్ళింది. అయితే ఈమెకి మయోసిటిస్ వ్యాధి సోకింది అని తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ చికిత్స పరంగా సమంత పట్ల చాలా కేర్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సమంత కి రామ్ చరణ్ మొదటి నుండి మంచి స్నేహితుడు, అతని భార్య ఉపాసన తో కూడా సమంత కి మంచి స్నేహం ఉంది.

- Advertisement -
samantha upasana konidela

ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి సీఈఓ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ప్రపంచం లో ఉన్న ప్రఖ్యాత డాక్టర్స్ మొత్తం ఆమెకి తెలుసు. సమంత కి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ని సజస్ట్ చేసింది ఉపాసనే అట. ఆమె కారణంగానే సమంత తొందరగా మయోసిటిస్ నుండి కోలుకుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

Samantha upasana
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here