హైదరాబాదీ నటుడు విజయ్ వర్మ గురించి పరిచయం అవసరం లేదు. ఇక మిల్కీ బ్యూటీ తమన్నాతో ఈ గురుడి ప్రేమాయణం గురించి కూడా అందరికీ తెలిసిందే. న్యూ ఇయర్(2023) సందర్భంగా గోవాలో వీరిద్దరు ముద్దులు పెట్టుకుంటున్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. అయితే, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వచ్చిన తర్వాత.. ఈ జంట ఎక్కడ కలిశారు? వీరి లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందంటూ.. నెటిజన్లు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు చాలా రోజులుగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నా.. తమన్నా, విజయ్ మాత్రం ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

ప్రస్తుతం విజయ్ వర్మ’దహాద్’ అనే సినిమాలో నటించారు. క్రైమ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన, తమన్నాతో డేటింగ్ ఊహాగానాలపై స్పందించారు. ‘దహాద్’ టీజర్ లాంచ్ సందర్భంగా తన సహనటుడు గుల్షన్ దేవయ్య, విజయ్ వర్మను టీజ్ చేశారు. స్టేజి మీదే తమన్నాతో ప్రేమాయణం గురించి అడగడంతో విజయ్ సిగ్గు పడ్డారు. తాజా ఇంటర్వ్యూలోనూ విజయ్ సమాధానం చెప్పకుండా కేవలం సిగ్గుతో ఔననే ఆన్సర్ ఇచ్చారు.

అంతేకాదు మీరు పెళ్లికి ముందే ట్రిప్ లకు వెళ్లారు నిజమేనా అని అడగ్గా.. అవునన్నారు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లికి ముందే అన్ని అయిపోయాయని ఫిక్స్ అయ్యారంతా. న్యూ ఇయర్ వేడుకలను ముగించుకుని గోవా నుంచి ముంబైకి తిరిగి వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో వీరిద్దరు ఒకరి వెనుక మరొకరు వస్తూ కనిపించారు. అప్పుడు వీరిద్దరు డేటింగ్ ఉన్న మాట వాస్తవమే అనే విషయం తేటతెల్లం అయ్యింది. డిసెంబర్ 21న తమన్నా పుట్టినరోజు సందర్భంగా విజయ్.. ఆమె ఇంటికి వెళ్లాడు. బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. 2023 న్యూ ఇయర్ వేడుకలతో గోవా వేదికగా వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. ఏదేమైనా త్వరలోనే ఈ మిల్కీ బ్యూటీ పెళ్లిపీటలెక్కనుంది.