Kalki 2898AD: ‘కల్కి 2898AD’ సినిమాలో విజయ్ దేవరకొండ.. ఏ పాత్రలో కనిపించనున్నాడో తెలుసా ?

- Advertisement -

Kalki 2898AD: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా చిత్రయూనిట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి సార్లు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి స్టార్ హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ దాదాపు రూ.400కోట్లతో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో కనపడుతున్నాడు. ప్రభాస్ వెహికిల్ బుజ్జికి సంబంధించిన దృశ్యాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తున్నాయి.

‘కల్కి 2898AD’ ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు ఆయన అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. థియేటర్లలోనూ కల్కి ట్రైలర్ విడుదల చేశారు. యూట్యూబ్ లో కేవలం 12గంటల్లో ఏడు మిలియన్ల వ్యూస్ తో కల్కి ట్రైలర్ దూసుకుపోతుంది. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన ప్రతి అప్‌డేట్ సినిమాలపై భారీ హైప్‌ను పెంచేశాయి. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సైతం నటించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

- Advertisement -

పురాణాల స్ఫూర్తితో.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో.. అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఇక విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇందులో విజయ్ పాత్ర మహాభారంలోని అర్జునుడి పాత్రని పోలివుంటుందని టాక్. అయితే ఇది కేవలం అతిథి పాత్ర అనుకుంటే మీ పొరపాటే.. సినిమాలో పూర్తి నిడివి ఉన్న పాత్రలోనే కనిపించనున్నాడట.. అంతే కాకుండా విజయ్ పాత్ర ఈ మూవీలో చాలా కీలకమని తెలుస్తోంది. ఇక దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. ఈ హీరో పాత్ర కూడా పురాణాల నేపథ్యంలోనే ఉంటుందని సమాచారం. మరి దీనిలో వాస్తవం ఎంత ఉందో తెలియాలంటే..చిత్రం వచ్చేవరకు వేచి ఉండాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here