Ram Charan రికార్డును తిరగరాసిన విజయ్ దేవరకొండ.. సంబరాలు చేసుకుంటున్న రౌడి హీరో ఫ్యాన్స్..

- Advertisement -

Ram Charan విజయ్ దేవరకొండ ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇటీవలే రామ్ చరణ్ 20 మిలియన్ మార్క్ ని చేరుకున్నారు. 20 మిలియన్ మార్క్ ఫాలోవర్స్ ను అత్యంత వేగంగా చేరుకున్న దక్షిణ భారతదేశంలోని మొదటి నటుడిగా రామ్ చరణ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు 21 మిలియన్ల ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ను విజయ్ దేవరకొండ చేరుకోవడం విశేషం.

కాగా, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండల కంటే ఎక్కువగా 30 మిలియన్ల ఫాలోవర్స్ ను సమంత చేరింది. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ 24.2 మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో నిలిచారు. అయితే వారంతా పాన్ ఇండియా లెవల్ లో సినిమాలు చేసి పేరు తెచ్చుకుంటే కేవలం తెలుగు సినిమా గీతగోవిందంతో ఒక్కసారిగా హైలైట్ అయిన విజయ దేవరకొండ లైగర్ తో ప్లాప్ తెచ్చుకున్నా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ్ దేవరకొండ తన కెరీర్ గురించి కొత్త సినిమాల అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు తెలియజేయడంలో ముందు వుంటారు.

అంతేకాదు తనకు సినిమాలకు పర్సనల్ లైఫ్‌కు సంబంధించి వచ్చే రూమర్స్ పై ఎప్పటికపుడు స్పందిస్తూ ఉంటారు. వాటిని అప్పటికపుడు క్లారిటీ ఇస్తూ ఉంటారు. ఈయనలోని ఈ నైజమే ఈయన్ని అభిమానులకు దగ్గర చేసింది. గతేడాది ‘ఖుషీ’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన విజయ్ దేవరకొండ.. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో పలకరించబోతున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here