Vijay Antony ఆరోగ్య పరిస్థితి విషమం.. క్లారిటీ ఇచ్చిన హీరో భార్య

- Advertisement -

Vijay Antony .. తమిళ ఇండస్ట్రీలో ఈపేరు తెలియని వారుండరు. కానీ టాలీవుడ్ లో మాత్రం ఈ హీరో పేరు బిచ్చగాడు సినిమాతోనే తెలిసింది. ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. ఆ చిత్రంతో ఈ హీరో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో తిష్టవేసుకుని కూర్చున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో ముఖం మొత్తిన తెలుగు ప్రేక్షకులకు విజయ్ ఓ డిఫరెంట్ సినిమాను చూపించాడు.

Vijay Antony
Vijay Antony

హీరో అంటే నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రొమాన్స్ మాత్రమే కాదు.. డిమాండ్ చేస్తే ఎంత కిందస్థాయి పాత్రలోనైనా నటించేవాడే హీరో అని నిరూపించాడు. బిచ్చగాడు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. తల్లి సెంటిమెంట్ తో వచ్చిన విజయ్.. ప్రతి తెలుగు తల్లికి తెగ నచ్చేశాడు. 

ఈ హీరో కేవలం నటుడే కాదు.. దర్శకుడు.. నిర్మాత.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా. బిచ్చగాడు తర్వాత టాలీవుడ్ లో విజయ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది. విజయ్ ఆంటోనీ సినిమా రిలీజ్ అవుతుందంటే.. మొదటి రోజే థియేటర్లకు తెలుగు ప్రేక్షకులు ఏం పరుగెత్తరు కానీ.. పక్కా ఆ సినిమాను థియేటర్ లోనే చూస్తారు. విజయ్ ఆంటోనీ సినిమాల్లో కంటెంట్ తప్పకుండా ఉంటుందనే నమ్మకం.

- Advertisement -
vijay antony

ప్రేక్షకుల నమ్మకాన్ని విజయ్ తన ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. అలా తమిళంలో రిలీజ్ అయిన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికే డజనుకు పైగా విజయ్ ఆంటోనీ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా బిచ్చగాడు సినిమా సీక్వెల్ బిచ్చగాడు-2 షూటింగ్ కోసం మలేసియా వెళ్లాడు. అయితే ఈ షూటింగ్ లో పాల్గొంటున్నప్పుడు విజయ్ కు ప్రమాదం జరిగింది. 

“మలేసియాలోని లంకావీ దీవిలో బిచ్చగాడు-2 షూటింగ్ జరుగుతోంది. ఓ సీన్ కోసం విజయ్ ఆంటోనీ చాలా వేగంగా వాటర్​ బైక్ డ్రైవ్ చేశారు. అదుపు తప్పి కెమెరా ఉన్న పడవను ఢీకొట్టారు. విజయ్​ నీటిలో పడిపోయారు. ఆయనకు ఈత రాదు. మునిగిపోతూ చాలా నీళ్లు తాగేశారు. వెంటనే సిబ్బంది ఆయన్ను కాపాడి ఆస్పత్రికి తరలించారు. విజయ్ ముఖానికి తీవ్ర గాయాలు అయ్యాయి. పళ్లు విరిగాయి. ఆస్పత్రికి వెళ్లే సరికి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు” అని బిచ్చగాడు-2 షూటింగ్​లో భాగమైన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా హుటాహుటిన చెన్నై నుంచి మలేసియా వెళ్లారు. అక్కడి నుంచి ఆమె విజయ్​ను చెన్నైకి తరలించారు. అయితే విజయ్ ఆరోగ్యం ప్రస్తుతం విషమంగా ఉందని.. వెంటనే ఆయణ్ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 

మీడియాలో వస్తున్న వార్తలు చూసి తమిళ ప్రజలతో పాటు తెలుగు అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో విజయ్ భార్య ఫాతిమా ఆయన ఆరోగ్యం గురించి క్లారిటీ ఇచ్చింది.  తన భర్త ఆరోగ్యం గురించి మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం అంటూ పుకార్లను కొట్టి పారేసింది.
తుంటికి గాయం అవ్వడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు తప్ప ఆయన ఆరోగ్యం విషమంగా లేదు అంటూ చెప్పుకొచ్చింది. ఆమె ప్రకటనతో విజయ్ ఆంటోనీ ఫ్యాన్స్ రిలాక్స్ అయ్యారు.     

మరోవైపు.. విజయ్ కోలుకుంటున్నారని నిర్మాత ధనంజేయన్ ట్విటర్​ ద్వారా వెల్లడించారు. సంగీత దర్శకుడిగా 2005లో తమిళ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు విజయ్ ఆంటోనీ. నేపథ్య గాయకుడిగా, నటుడిగా, ఎడిటర్​గా, పాటల రచయితగా, ఆడియో ఇంజినీర్​గా, దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. ప్రస్తుతం విజయ్ వల్లి మాయల్, తమిళ్ అరసన్, బిచ్చగాడు-2 సినిమాల్లో నటిస్తున్నారు. బిచ్చగాడు-2 చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here