Victory Venkatesh ఇటీవల కాలం లో విక్టరీ వెంకటేష్ మరియు రానా దగ్గుపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ ఎన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.వెంకటేష్ లాంటి పెద్ద హీరో ఇంత బోల్డ్ అడల్ట్ కంటెంట్ చెయ్యడం ఏమిటి..!, ఇది ఆయన ఇమేజీకి మాయని మచ్చ అంటూ నెటిజెన్స్ దగ్గర నుండి ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళ వరకు నెగటివ్ కామెంట్స్ వినిపించాయి.

అయితే ఎంత నెగటివ్ కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా ఈ సిరీస్ వ్యూస్ పరంగా సెన్సేషనల్ రికార్డు ని నమోదు చేసుకుంది.విక్టరీ వెంకటేష్ ని యూత్ ఆడియెన్స్ కి బాగా దగ్గర చేసింది కానీ,ఆయన కెరీర్ కి పునాది లాంటి ఫ్యామిలీ ఆడియన్స్ లో మాత్రం ఆయనపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది.దీని ప్రభావం ఆయన తదుపరి చిత్రం పై ఎలా చూపిస్తుందో తెలియదు కానీ,ప్రముఖ సీనియర్ మోస్ట్ దర్శకుడు గీత కృష్ణ లేటెస్ట్ గా ఈ సిరీస్ గురించి చేసిన కామెంట్స్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

రానా నాయుడు వెబ్ సిరీస్ మీద మీ అభిప్రాయం ఏమిటి..?, వెంకటేష్ మరియు రానా వంటి హీరోలు ఇలాంటి బోల్డ్ కంటెంట్ చెయ్యడం అవసరం అంటారా? అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్న కి గీత కృష్ణ సమాధానం చెప్తూ ‘ఇలాంటి సిరీస్ తియ్యడం లో తప్పు ఏమి ఉంది..?,వెంకటేష్ మరియు రానా నిజ జీవితం లో పవిత్రులు ఏమి కారు,వాళ్లకి బయట ఎన్ని అఫైర్స్ ఉన్నాయో నాకు తెలుసు.బయట చేస్తే తప్పు కానిది, వెబ్ సిరీస్ లో చేస్తే తప్పా?, ఇదెక్కడి న్యాయం, రానా గురించి ఆయన తమ్ముడి గురించి ఎంత మందికి తెలీదు?, ఆయన తమ్ముడు అభిరామ్ ‘బి’ గ్రేడ్ నటితో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడు.యూత్ అడల్ట్ కంటెంట్ నచ్చుతున్నప్పుడు, వాళ్లకి లేని ఇబ్బంది మిగతా వాళ్లకు ఎందుకు’ అంటూ గీత కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడాడు.
