Rashmika mandana : ముద్దు పెట్టడం ఎలానో చెప్తారా అంటున్న రష్మిక.. నెటిజన్స్ ట్రోల్స్ వైరల్..

- Advertisement -

Rashmika mandana : నేషనల్ క్రష్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యింది..అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఫెమస్ అయిన ఈ అమ్మడు ఎప్పుడూ ఏదొక వార్తతో ఫెమస్ అవుతూ వస్తుంది..రష్మిక ఎంత బోల్డ్ గా ఉంటుందో అందరికి తెలుసు.. కానీ ఇప్పుడు ఓ వార్తతో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదేంటంటే తనకు ముద్దు ఎలా పెట్టాలో తెలియదట..నాకు పెదాలతో గుచ్చటం రాదు. కిస్ చేసే విధానం ఇదేనా అని అర్థం వచ్చేలా ఓ ఇంగ్లీష్ కామెంట్ చేసింది. ముద్దిస్తున్నట్లు పెదాలు ముడిచి కవ్వించే ఫోటో దిగారు. రష్మిక చిలిపి ప్రశ్నకు నెటిజెన్స్ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.. నాకు కొంచెం చెప్పండి ప్లీజ్ అంటూ ఓ పోస్ట్ పెట్టింది.. అది ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది..

Rashmika mandana
Rashmika mandana

తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాదు..స్టార్ హీరోల సరసన భారీ బడ్జెట్ సినిమాలలో నటించింది..గత ఏడాది రష్మికకు మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. విజయ్ కి జంటగా నటించిన వారిసు రూ. 300 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. తెలుగు వెర్షన్ వారసుడు మాత్రం పర్లేదు అనిపించుకుంది. రష్మిక చేతిలో పుష్ప 2, యానిమల్ వంటి భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి..ఆ రెండు సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి..ఇక నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నారు. వెంకీ కుడుములతో రష్మికకు ఇది హ్యాట్రిక్ మూవీ. గతంలో సేమ్ కాంబోలో భీష్మ తెరకెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అలాగే రైన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ చిత్రం ప్రకటించింది..

Actress
Actress

ఇవే కాదు మరో రెండు ప్రాజెక్టు లలో నటిస్తుందని సమాచారం..అలాగే హీరో విజయ్ దేవరకొండతో రూమర్స్ పై అనేక రకాల వార్తలను ఎదుర్కొంటుంది..విజయ్ దేవరకొండతో పాటు మాల్దీవ్స్ వెకేషన్ కి వెళ్లినట్లు రష్మిక ఒప్పుకున్నారు. ఫ్రెండ్ తో ట్రిప్ వెళితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు..వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఒప్పుకోలేదు కానీ వీరి మధ్య ఎదో ఉందని మాత్రం సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంకొద్ది రోజులకైనా నిజం చెప్తారేమో చూడాలి.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here