Star Couples: పబ్లిక్ లో గొడవపడి పరువు పోగొట్టుకున్న స్టార్ కపుల్స్ ఎవరో తెలుసా?Star Couples: సాదారణంగా భార్యా భర్తల మధ్య గొడవలు రావడం కామన్..చికాకులు ఉండటం సహజం.. నిజానికి అలా లేని కాపురం అసలు బాగోదు..ఆ గొడవలు కేవలం నాలుగు గోడల మధ్య అయితేనే బాగుంటుంది.. పబ్లిక్ లో అస్సలు బాగోదు.. ఒక్కసారి గడపదాటి బయటకు వచ్చాక.. చాలా పద్దతిగా వ్యవహరించాలి. నిజానికి సామాన్యుల్లో ఉండే భార్యాభర్తలు బయట గొడవ పడినప్పటికీ మిగిలిన జనాలు పెద్దగా పట్టించుకోరు.

కానీ సెలబ్రిటీ కపుల్స్ ఎవ్వరైనా కాస్త చిరాకు పడుతున్నట్టు కనిపిస్తే.. వాళ్ళు విడిపోతున్నట్లు కన్ఫర్మ్ చేసేస్తారు.ఈ మధ్య ఎన్నో జంటలు విడాకులు తీసుకున్నారని వార్తలు వినిపించాయి.. బాలీవుడ్లో ఇలాంటివి ఎక్కువ. అందుకే సెలబ్రిటీలు చాలా జాగ్రత్త పడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో స్టార్ కపుల్స్ పబ్లిక్ ప్లేసుల్లో చిర్రు బుర్రులాడుతుండడం బయటపడింది. అది కూడా బాలీవుడ్ కపుల్స్ విషయంలో…అలా గొడవ పడి పబ్లిక్ లో పరువుపోగొట్టుకున్న సెలెబ్రేటీ స్టార్ కపుల్స్గు రించి ఇప్పుడు తెలుసుకుందాం..

దీపికా పదుకోనె – రణ్వీర్ సింగ్..

Star Couples
Star Couples

వీరిద్దరి గురించి అందరికి తెలుసు.. వీళ్ళు విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.. ఓ పబ్లిక్ ఈవెంట్లో రణ్వీర్ సింగ్ చేయి పట్టుకోవడానికి దీపికా ఇష్టపడలేదు. పైగా అప్పుడు చాలా కోపంగా ఉన్నట్టు దర్శనమిచ్చింది..

ఐశ్వర్య రాయ్.. అభిషేక్ బచ్చన్..

abhishek

విశ్వ సుందరి ఐశ్వర్య గురించి అందరికి తెలుసు.. ఈ అమ్మడు అమితాబచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది.. ఓ ఈవెంట్ లో ఐసు అభిషేక్ పై కోపంగా కళ్లు తిప్పడం తో గాసిప్స్ పుట్టుకొచ్చాయి.. ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

అలియా భట్ – రణబీర్ కపూర్..

ranbir

ఎయిర్పోర్ట్ లో ఈ జంట గొడవ పడుతున్నట్టు ఉన్న వీడియో బాగా వైరల్ అయ్యింది అలాగే హాట్ టాపిక్ కూడా అయ్యిందని చెప్పాలి.. వీరిద్దరికీ ఇప్పుడు ఒక బిడ్డ పుట్టింది..

షారుఖ్ ఖాన్ – గౌరీ ఖాన్..

sharukh

ఆలియా భట్ ఈ జంట ఇటీవల ఎన్.ఎం.ఎ.సి.సి వద్ద గొడవపడుతున్నట్టు ఉన్న వీడియో చాలా అనుమానాలకు దారి తీసింది.. దాంతో వీరిపై కూడా రకరకాల గాసిప్ లు వచ్చాయి..

బాలివుడ్ లోనే కాదు టాలివుడ్ లో కూడా ఇలాంటి జంటలు ఎంతో మంది ఉన్నారు.. వారిలో ఎంత మంది విడాకులు తీసుకుంటున్నారో చూడాలి..