Venkatesh : స్టార్ హీరోయిన్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన విక్టరీ వెంకటేష్.. అసలు ఏమి జరిగింది?

- Advertisement -

Venkatesh : ప్రముఖ దిగ్గజ నిర్మాత దగ్గుపాటి రామానాయుడు గారి కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వెంకటేష్ తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ తోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ సినిమా తర్వాత ఆయన విభిన్నమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ టాప్ 4 స్టార్ హీరోస్ లో ఒకడిగా దశాబ్దాలు కొనసాగాడు, ఇప్పటికీ కుర్ర హీరోలతో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతూ అద్భుతమైన వసూళ్లను సాధిస్తున్నాడు.

Venkatesh
Venkatesh

అయితే వెంకటేష్ ఎంతమంది హీరోయిన్స్ తో కలిసి నటించినా, ఆయన సౌందర్య తో కలిసి నటించిన సినిమాలకు ఉండే క్రేజ్ మరో సినిమాకి వచ్చేది కాదు.అప్పట్లో వీళ్లిద్దరు కాంబినేషన్ వెండితెర మీద ఎంతో చూడచక్కగా ఉండేది, భార్య భర్తల దాంపత్యం అంటే ఇలా కదా ఉండాల్సింది అనే రేంజ్ లో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఉండేది.వీళ్ళ కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

Venkatesh Photos

ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వాళ్ళిద్దరి మధ్య రూమర్స్ క్రియేట్ చెయ్యడం, వాళ్ళ మధ్య ఎదో ఎఫైర్ నడుస్తున్నట్టు పుట్టించి TRP రేటింగ్స్ సాధించడం, అనాదిగా వస్తున్న ఆచారం లాగ మారిపోయింది.అప్పట్లో వీళ్లిద్దరి మధ్య కూడా ఎదో నడుస్తుందని రూమర్స్ వచ్చేవి, అయితే వెంకటేష్ అప్పట్లోనే తాను నా చెల్లి లాంటిది అని మీడియా ముందు చెప్పి అందరి నోర్లు మూయించాడు.ఇది ఇలా ఉండగా ఆరోజుల్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘పవిత్ర బంధం’ భారీ హిట్ అయ్యింది.

- Advertisement -
Daggubati venkatesh

ఈ సినిమాకి సంబంధించి ప్రొమోషన్స్ మెటీరియల్ లో, పోస్టర్స్ లో వెంకటేష్ సౌందర్య కాళ్ళు పట్టుకునేది ఉంటుంది.ఒక పెద్ద హీరో హీరోయిన్ కాళ్ళు అలా పట్టుకుంటే ఆడియన్స్ స్వీకరించరు అని వెంకటేష్ సన్నిహితులు చెప్తూ ఉండేవారట. దానికి వెంకటేష్ కథలో బలం ఉంటే జనాలు వాటిని అసలు పట్టించుకోరు, మీరు నేను చెప్పినట్టు చెయ్యండి అని అన్నాడట. ఆయన చెప్పినట్టు గానే చేసారు,సినిమాలో ఆ సన్నివేశానికి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది.ఇది ఇలా ఉండగా వెంకటేష్ హీరో గా నటించిన ‘రానా నాయుడు‘ అనే వెబ్ సిరీస్ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

bavitrabandham
Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here