Venu Swamy : ప్రభాస్ కు ఈ జన్మలో పెళ్లి కాదు.. త్వరలో ఆయన కెరీర్లో జరిగే మార్పు ఏంటో చెప్పిన వేణుస్వామి..

- Advertisement -

Venu Swamy : పాన్ ఇండియా రెబల్ స్టార్ వయసు 44 ఏళ్ళు. ఆయనకు పెళ్ళీడు వచ్చి చాలా ఏళ్ళైంది. ఇంకా పెళ్లి మాత్రం కాలేదు. అసలు ఆయనకు పెళ్లి యోగం లేదని ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ కు ఈ జన్మలో పెళ్లి కాదని, ఆయనకు పెళ్లి యోగం లేదని ఈ మధ్య ఓ డిజిటల్ (యూట్యూబ్) మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త వేణు స్వామి చెప్పారు.

Venu Swamy
Venu Swamy

ప్రభాస్ పెళ్లి విషయంలో సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. దాంతో రెబల్ స్టార్ అభిమానులు వేణు స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి మాత్రమే కాదు… ఆయన కెరీర్ గురించి కూడా వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కెరీర్ సాఫీగా ముందుకు సాగడం కష్టం అన్నట్లు చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే… ‘బాహుబలి : ది బిగినింగ్’, ‘బాహుబలి : ది కన్‌క్లూజన్’ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలు సరైన విజయాలు సాధించలేదు.

‘సాహో’ చిత్రానికి విమర్శకులు, మెజారిటీ ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. కానీ, ఉత్తరాదిలో కొందరు ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. దాంతో అక్కడ వంద కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. దాంతో ‘సలార్’ మీద ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. వేణు స్వామి వ్యాఖ్యలు ఆ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here