Venu Swamy : సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయిపోయారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన కామెంట్ చేస్తూ వార్తలలో నిలుస్తున్నారు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ విపరీతమైన క్రేజ్ ని తెచ్చుకున్నారు. సెలబ్రిటీల యొక్క పర్సనల్ లైఫ్ లో సమస్యలు కెరియర్ గురించి చెబుతూ వేణు స్వామి సోషల్ మీడియాలో దుమారం రేపుతూ ఉంటారు. జాతకాల పేరుతో హీరోలు రాజకీయ నాయకులు మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తారు. నిత్యం కాంట్రవర్సీతో సాహసాన్ని చేస్తూ ఉంటారు. వేణు స్వామి గతంలో వేణు స్వామి ప్రభాస్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి కెరియర్ అయిపోయిందని బాహుబలి తర్వాత మళ్ళీ అంత స్థాయిలో ఏ సినిమా కూడా ఉండదని చెప్పారు.

సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు సినిమా ఫ్లాప్ అవుతుందని అన్నారు. అనారోగ్య సమస్యలు కూడా ప్రభాస్ కి వస్తాయని, కెరీర్ డౌన్ అవుతుందని వేణు స్వామి ఇలా ఎన్నో కామెంట్స్ చేశారు. కానీ సలార్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ ని అందుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ వేణు స్వామి ని ఆట ఆడేసుకున్నారు వేణు స్వామి కూడా వాళ్లపై కౌంటర్లు వేశారు. ఇటీవల సలార్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి.
దీంతో కలెక్షన్స్ వివరాలు కూడా బయటపడ్డాయి. బయర్ల నష్టాలని నిర్మాతలు సెటిల్ చేసేసారట. డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని కూడా తెలుస్తోంది. దీంతో గతంలో వేణు స్వామి చెప్పిన మాటలు మళ్ళీ తెరమీదకి వచ్చాయి. సలార్ ఫ్లాప్ అవుతుందని ముందే చెప్పాను కదా అని అర్థం వచ్చే విధంగా ఒక మీమ్ షేర్ చేశారు. సలార్ సినిమా ఫ్లాప్ అని చెప్తే నన్ను బాగా వేసుకున్నారు. ఇప్పుడు అర్థమైందా అని వేణు స్వామి పోస్ట్ చేశారు. ఏదేమైనా వేణు స్వామి చెప్పింది మళ్ళీ నిజమైందని ప్రూవ్ అయింది.