Aishwarya Vullingala : జబర్ధస్త్ బ్యూటీ పరిస్థితి ఏంటి ఇలా అయింది.. ‘మెర్సి కిల్లింగ్’ చేయాలని వేడుకోలు

- Advertisement -

Aishwarya Vullingala : బుల్లితెర టాప్ కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు వెండితెర పై తమ ప్రతిభ చాటుతున్నారు. వారి బాటలోనే మరో భాయ వెండి తెరపై హీరోయిన్ గా రాణించబోతోంది. తానెవరో కాదు ఐశ్వర్య ఉల్లింగల.. త్వరలోనే ఆమె హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. సాయి సిద్ధార్థ మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కిన “మెర్సి కిల్లింగ్”సినిమాతో ఆమె త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి కుమార్, పార్వతీశం, ఐశ్వర్య ఉల్లింగల, హారిక ప్రధాన పాత్రల్లో సిద్ధార్థ్ హరియల, మాధవి తాళబత్తుల నిర్మిస్తున్న ఈ మెర్సి కిల్లింగ్ సినిమాని వేదుల బాల కామేశ్వరి సమర్పిస్తున్నారు.

Aishwarya Vullingala
Aishwarya Vullingala

సూరపల్లి వెంకటరమణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు జి.అమర్ సినిమాటోగ్రాఫి అందిస్తున్నారు. ఈ సినిమాకు ఎం.ఎల్.రాజా సంగీతం అందిస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను యువ హీరో ఆకాష్ పూరి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరి మాట్లాడుతూ సినిమా టైటిల్ చాలా ఆసక్తి కరంగా ఉందన్నారు. మెర్సి కిల్లింగ్ టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ లో కాన్సెప్ట్ బాగుంది. ఇలాంటి కాన్సెప్ట్ తో వస్తున్న సినిమాలు తప్పకుండా హిట్ కొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

- Advertisement -

మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో రాబోతున్న ఈ చిత్రం హైదరాబాద్, కాకినాడ, ఉప్పాడ, అరకు వంటి అందమైన లొకేషన్స్ లో షూట్ చేశారు. ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాలన్నారు. ఇక భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆధారంగా తెరకెక్కిన సినిమా మెర్సీ కిల్లింగ్. స్వేచ్ఛ అనే అనాథ బాలిక తనకు న్యాయం చేయమని కోరడంతో ఈ కథ ప్రారంభం అవుతుందని సినిమా డైరెక్టర్ వెంకటరమణ తెలిపారు. ఆనంద్ చక్రపాణి, ఘర్షణ శ్రీనివాస్, షేకింగ్ శేషు, ఎఫ్.ఎం.బాబాయ్, రంగస్థలం లక్ష్మీ, ల్యాబ్ శరత్, హేమ సుందర్, వీరభద్రం, ప్రమీల రాణి తదితరులు ఈ సినిమాలో నటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here