Veera Simha Reddy : ‘వీరసింహారెడ్డి’ స్టోరి లీక్..అదే కథ రిపీట్.. బోర్ కొట్టిస్తాడా?

- Advertisement -

Veera Simha Reddy : నందమూరి హీరో బాలకృష్ణ ఈ మధ్యకాలంలో డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమాలను చేస్తున్నారు. ఆ సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను అందుకోవటం మాత్రమే కాదు..హిట్ టాక్ ను కూడా అందుకున్నాయి.ఇక ఇటీవల బాలయ్య బాబు నటించిన అఖండ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ను చేరుకుంది. ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది..వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది..

Veera Simha Reddy
Veera Simha Reddy

ఈ క్రమంలో ఈ సినిమా గురించి ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. సినిమా స్టోరి లీక్ అయ్యింది..గతంలో ఎప్పుడూ ఇలా జరగలెదని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. ఈ సినిమా స్టోరీ, డైలాగులు బయటకు లీకయ్యాయి. ఇప్పటికే విడుదలైన జై బాలయ్య సాంగ్, సుగుణసుందరి సాంగ్స్ కి మంచి స్పందన వచ్చింది. అలాగే టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ కూడా సూపర్ గా ఉన్నాయి.

- Advertisement -

అందుతున్న సమాచారం ప్రకారం.. మలినేని గోపీచంద్ సూపర్ హిట్ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా నుంచి లీకైన స్టోరీ డైలాగ్స్ అదరగొడుతున్నాయి. ఈ సినిమాలో ఓ డైలాగ్ మామూలుగా లేదు. బాలయ్య ఎడమ కాలు తొడ కొట్టి ఒక అడుగు ముందుకు వేసి విలన్ పీక మీద కాలు పెట్టి పులివెందుల అయినా పులిచర్ల అయినా పులిబిడ్డ ఈ వీరసింహారెడ్డి. ప్రజల ముందు ఉంటే సింహం ముందు ఉన్నట్టే ఆ సింహాన్ని ఎదిరించి వెళ్లి దమ్ముంటే రేయ్ నువ్వు నన్ను దాటి ప్రజల దగ్గరికి వెళ్ళారా అనేదే డైలాగ్. ఈ డైలాగ్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో చూస్తే అర్థమవుతుంది.

ఇకపోతే ఈ చిత్రంలో డ్యూయల్ రోల్స్ చేస్తున్నారు. ఒకటి విలేజ్ బ్యాక్ డ్రాప్ వీరసింహారెడ్డి , మరొకటి అమెరికా నుంచి వచ్చే బాల సింహారెడ్డి . ఇవి తండ్రి కొడుకుల క్యారెక్టర్స్. గ్రామ రాజకీయాలలో వీరసింహారెడ్డి చనిపోతే బాలసింహారెడ్డి విలన్లపై పగ తీర్చుకుంటాడు. తన గ్రామం అభివృద్ధి కోసం తన తండ్రి తన కలల్ని తీర్చుతాడు బాలసింహారెడ్డి. సాఫ్ట్ వేర్ నుంచి రాజకీయాల్లోకి వస్తే పిల్ల బచ్చాగాడు అని లైట్ తీసుకున్న వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాడు అన్నది స్టోరీ.. ఈ స్టోరీ వింటుంటే ఈ సినిమా హిట్ అవ్వడం పక్కా అనిపిస్తుంది కదూ..ఇక సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here